నిజాంపేట, నేటి ధాత్రి
మండల పరిధిలోని బచ్చురాజు పల్లి గ్రామానికి చెందిన సురేష్ రోడ్డు ప్రమాదంలో మరణించగా సోమవారం బీఆర్ఎస్ పార్టి మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి , హాజరై పార్థివ దేహానికి నివాళులర్పించి అంత్యక్రియలకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
చల్మెడ గ్రామానికి చెందిన భాజ దుర్గయ్య అనారోగ్యంతో మృతిచెందగా ఆయన అంతిమయాత్రలో పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
వారితో పాటు మండల ముఖ్య నాయకులు కల్వకుంట పిఎసిఎస్ చైర్మన్ అందే కొండల్ రెడ్డి , కల్వకుంట మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, గ్రామ బిఆర్ఎస్ అధ్యక్షులు చలమేటి నాగరాజు, లక్ష్మీ నరసింహులు, చల్మెడ మాజీ ఎంపీటీసీ బాల్రెడ్డి, సంగు స్వామి ,మండల బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు మావురం రాజు, రెడ్డి శెట్టి రవీందర్, రమావత్ నరేందర్, ఆకుల మహేష్ , బాజా రమేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.