మాజి మంత్రి హరీష్ రావు కు శుభకార్యానికి ఆహ్వానించిన బీఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిదిలో భాగమైన మండలంలోని శేకపూర్ గ్రామానికి చెందిన ఫెరోజ్ ఖురేషి వివాహాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ సభ్యులు తన్నీరు హారిష్ రావు కు కలిసి వివాహానికి హాజరు కావాల్సిందిగా నూతనంగా ఎన్నికైన శేకపూర్ గ్రామ సర్పంచ్ మొహమ్మద్ చేష్మోద్దీన్ తో కలిసి ఆహ్వానాన్ని అందించారు. ఆహ్వానాన్ని అందుకున్న మాజి మంత్రి 26 వ తేదీన శేకపూర్ గ్రామంలో జరిగే వాలిమ వేడుకల్లో తప్పకుండా హాజరవుతాని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మొహమ్మద్ చెష్మోద్దీన్, నాయకులు మొహమ్మద్ షౌకత్ అలీ, కుసంగి సద్దాం, మాక్సుద్ ఖాన్, ఇస్మాయిల్ బిలాల్ పూర్, ఫెరోజ్ ఖురేషి, మొహమ్మద్ సాజిద్, మొహమ్మద్ ఖలేద్ తదితరులు పాల్గొన్నారు.
