ఓటమి ఎరుగని నాయకుడుసర్పంచ్ జోరుక సదయ్య
బిఆర్ఎస్ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు
గండ్ర జ్యోతి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
మొగుళ్ల పెళ్లి మండలంలోని పర్లపల్లి గ్రామ పంచాయతీ నూతన సర్పంచిగా ఎన్నికైన టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జోరుగా సదయ్యను జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అభినందించారు. మొగుళ్లపల్లి మండలంలో ఓటమి ఎరుగని నాయకుడు జోరుక సదన్న అని కొనియాడారు. ఎన్నికలలో బి ఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు అండగా ఎప్పుడు మీ వెంటే ఉంటామని ప్రజలు టిఆర్ఎస్ పార్టీ పై ఉన్న నమ్మకమే ఈరోజు రాష్ట్రంలో మెజారిటీ సర్పంచి స్థానాలను కైవసం చేసుకున్నామని ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ గ్రామాల్లో ఉంటూ ప్రజలతో మమేకమై సమస్య పరిష్కరించేందుకు కృషి చేయాలని గ్రామాభివృద్ధిపై దృష్టి సారించాలని జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అన్నారు. మొగుళ్ళపల్లి మండలంలోని పర్లపల్లి గ్రామంలో సర్పంచ్ గా గెలిచిన జోరుక సదయ్య ఓటమి ఎరుగని నాయకుడని జిల్లా అధ్యక్షురాలు జ్యోతి అభినందించారు. రాష్ట్రంలో వచ్చేది మన ప్రభుత్వమేనని ఇందుకు నిదర్శనం ఈ పంచాయతీ ఎన్నికలేనని అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికల లోబి ఆర్ఎస్ గెలవడం సంతోషమన్నారు. మండల కేంద్రంలో ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో ప్రజలు బి ఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను గెలిపించినందుకు మండల టిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీకృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ ఉప సర్పంచులు వార్డు సభ్యులు అందరూ సమిష్టిగా ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు
