రైతన్నలకు మద్దతుగా బిఆర్ఎస్ నేతలు
కాంగ్రెస్ ప్రభుత్వంను గద్దె దించడానికి సిద్ధంగా ఉన్న రైతులు
రైతన్నకు మద్దతు ధర ఇవ్వకుండా, రైతన్న కడుపు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంను, అదే రైతన్నలు గద్దే దించడానికి సిద్ధంగా ఉన్నారు.
* మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.*
వరంగల్, ఎనుమాముల నేటిధాత్రి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఎనుమాముల మార్కెట్ ను సందర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు. రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి పంట ధరలు పడిపోయి ఆందోళన చెందుతున్న రైతన్నలకు సంఘీభవంగా బిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే లు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ లు కలిసి ఏనుమముల మార్కెట్ ను సందర్శించి రైతన్నల కష్టాలను మద్దతు ధర లేక వాళ్లు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తూర్పు మాజీ ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతు.. రైతన్నలకు కనీస మద్దతు ధర లేక పెట్టిన పెట్టుబడి రాక ఈ రోజు రైతన్నలు రోడ్డున పడి ఆగమవుతున్నారు అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతన్నల పొట్టగొడుతున్నారు అని, ఇలా రైతన్నల జీవితాలతో ఆడుకుంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంను తొందరలోనే అదే రైతన్నలు భూస్థాపితం చేస్తారు అని చెప్పారు. రైతన్నలకు మద్దతు ధర ఇవ్వడంలో కాని, ఎరువుల సప్లై లో కాని, రైతు బీమాలో కాని రైతన్నను కేసీఆర్ చూసుకున్నట్లు ఎవరు చూడట్లేదని, ఆయనను మించిన నాయకుడు ఈ దేశలోనే లేడు అని అన్నారు. స్థానిక జిల్లా మంత్రి కొండా సురేఖ ఈ ఏనుమముల మార్కెట్ లో మద్దతు ధర కాని రైతన్నలు పడుతున్న ఇబ్బందులు మరియు గుమస్తాలు, దడవాయిలు, హమాలీ కార్మికులు పడుతున్న సమస్యలు ఇబ్బందులు ఏమీ కూడా పట్టించుకోవడం లేదు అని అన్నారు. ఇలా మద్దతు ధర ఇవ్వకుండా రైతన్నలను నానా గోసలు పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చే వరకు రైతన్న పక్షాన కొట్లాడటానికి మా బిఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉన్నదని నరేందర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణ రెడ్డి, వరంగల్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, తూర్పు కార్యకర్తలు, రైతన్నలు తదితరులు పాల్గొన్నారు.
