డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజ లను తప్పుద్రోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో స మావేశం ఏర్పాటు చేయడ మైనది ఈ సందర్భంగా బిఆర్ఎస్.వి రాష్ట్ర నాయ కులు కొమ్ముల శివ బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మారపల్లి మోహన్ మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్స్ పాలి టిక్స్ కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా బిఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో మాజీ మంత్రి హరీష్ రావును బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇబ్బందులు పెడుతూ రాక్షస ఆనందం పొందుతూ ప్రజలను మభ్యపెడుతూ సంక్షేమ పథ కాలు అందించడంలో కాల యాపనచేస్తూ విఫలమ వుతున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో తగిన గుణ పాఠం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ధైనంపల్లి కరుణ్ బాబు, కూతాటి రమేష్ యూత్ జిల్లా నాయకులు పెంబర్తి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
