
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ స్థానిక సర్పంచ్ ఆరెపల్లి లత రాజు,ఎంపీటీసీ ఈడుగు రాజేశ్వరి స్వామి ఆధ్వర్యంలో ప్రచారంలో నిర్వహించారు. చెన్నాడి అమిత్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సుంకె రవిశంకర్ కారు గుర్తుకు పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీఎంఎస్ చైర్మెన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, నాయకులు డాక్టర్ అమిత్ రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, ఏఎంసి వైస్ చైర్మన్ చిక్కాల సుధాకర్ రావు, పార్టీ మండల అధ్యక్షులు కొండయ్య, రైతుబంధు సమన్వయ సమితి అధ్యక్షులు లచ్చిరెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టి పెళ్లి సుధాకర్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.