రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు చోప్పదండి నియోజకవర్గ అభ్యర్థి సుంకే రవిశంకర్ కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎంపిటిసిల ఫోరం అధ్యక్షులు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు వెల్పుల హరిక్రిష్ణ, కోండగట్టు దేవస్థానం డైరెక్టర్ దాసరి రాజేందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు పూడురి మల్లేశం, ఎడవెల్లి ఆనందం, పాపిరెడ్డి, ఆముదాల భాస్కర్ రెడ్డి, సుద్దాల మల్లేశం, పార్టీ కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.