ఎంపీ వద్దిరాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ శ్రేణులు
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పుట్టినరోజు వేడుకలు ఖమ్మం తెలంగాణ భవన్ లో శనివారం ఘనంగా జరిగాయి.తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ నుంచి ఖమ్మం చేరుకున్న ఎంపీ రవిచంద్రకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలతో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆత్మీయ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర చేత కేక్ కట్ చేయించి శాలువాలతో ఘనంగా సన్మానించారు, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ వేడుకలలో పార్టీ నగర శాఖ అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నాయకులు ఉప్పల వెంకటరమణ,బెల్లం వేణు,ఖమర్,సామినేని హరిప్రసాద్,లకావత్ గిరిబాబు, పగడాల నరేందర్, మక్బూల్,డేరంగుల బ్రహ్మం,బలుసు మురళీకృష్ణ,లింగనబోయిన సతీష్,నమలికొండ వంశీ, మహ్మద్ రఫీ,భాషబోయిన వీరన్న, పలువురు జర్నలిస్టులు పాల్గొని ఎంపీ వద్దిరాజుకు హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు
