
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని గణపురం మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నారు
హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై జరిగిన దాడికి నిరసనగా గాంధేయ మార్గంలో శాంతియుతంగా దీక్ష చేస్తున్న మాజీ మంత్రి హరీష్ రావు గారిని బి ఆర్ ఎస్ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసిన తరుణంలో హైదరాబాద్ (సైబరాబాద్) వెళ్తున్నరన్న సమాచారంతో బిఆర్ఎస్ నాయకులను గణపురం పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు
అరెస్ట్ అయిన వారిలో మండల పార్టీ అధ్యక్షులు మోతే కర్ణాకర్ రెడ్డి పోలుసాని లక్ష్మీనరసింహారావు పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి దాసరి రవి తదితరులు ఉన్నారు