అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే నిదర్శనం శాయంపేట నేటిధాత్రి ;
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని, కార్యకర్తలు అందరూ సమిష్టిగా పని చేస్తూ ముఖ్యమంత్రి చేసిన ప్రభుత్వ సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన అంటే కరెంటు కష్టాలు,
ఆడబిడ్డలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు, ఎరువుల కోసం రైతన్నలు క్యూలైన్లు,రైతన్నలఆత్మహత్యలు,నేతన్నలఆత్మహత్యలు .అని అప్పట్లో కరెంటు ఉంటే వార్త. కానీ ఇప్పుడు కరెంటు పోతే వార్త అన్నట్లు కరెంటు సమస్యలను తీర్చాడు ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలు సుఖసంతోషాలతో సిరిసంపదలతో ఉంటారని తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గంట శ్యాంసుందర్ రెడ్డి. జైపాల్ రెడ్డి. ఉప సర్పంచ్ సరోజన మల్లయ్య. వార్డు మెంబర్స్ చల్ల సమ్మిరెడ్డి. రూపురెడ్డి రాజిరెడ్డి. కందకట్ల ప్రకాష్. ఐలయ్య. భోగం సాంబరాజు. గుర్రం కుమార్ స్వామి. బిల్లా శ్రీను.గజ్జి చేరాలు. యూత్ అధ్యక్షుడు పెండెల కిరణ్. బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.