వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు గారి సమక్షంలో చేరికలు..
పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి..
హసన్ పర్తి / నేటి ధాత్రి
వర్థన్నపేట నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో వర్థన్నపేట నియోజవర్గంలో బిఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. 43 వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు చింత ప్రకాష్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులను మరియు గౌడ సంఘం నాయకులను సుమారుగా 100 మందిని వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది. వారికీ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్బంగా వర్థన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ
ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకపోవడం, బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి మొన్నటి ఎన్నికల వరకు ప్రజలను మోస పూరిత మాటలతో మభ్యపెడుతూ కాలం వెల్లదీశారని అన్నారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన సాధ్యమని తెలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ను భారీ మెజారితో గెలిపించి వరంగల్ గడ్డ పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలి అని తెలిపారు.ఈ కార్యక్రమం లో 43వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.