కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలు

వర్థన్నపేకాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు,మహిళలుట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు సమక్షంలో చేరికలు

స్థానిక సంస్థల ఎన్నికల్లే లక్ష్యంగా భారీ చేరికలు

పార్లమెంట్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేయండి.

14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి సుమారు 200 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు

హసన్ పర్తి / నేటి ధాత్రి

ఈరోజు హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని బాలాజీనగర్, కార్లర్స్మార్క్ నగర్, ఎన్టీఆర్ నగర్, సాయి గణేష్ కాలనీల నుంచి 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ నుండి సుమారు 200 మందిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటానని, నేను నాకు ఉన్న తక్కువ సమయంలో మీ మీ దగ్గరికి రాకుండా నన్ను నమ్మీ ఓటు వేసిన మీ అందరిని కడుపులో పెట్టుకొని చూసుకుంటానని మీకు కష్టాలలో మీ ఊరి సమస్యలు ఎప్పటికీ మీకు తోడుగా ఉంటానని అలాగే నాకు ఎలాగైతే కష్టపడ్డారో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త పాత కలయికతో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్, పురాణం రవి, షేక్ జావేద్, పైసా మహేష్, ఈర్ల రాజేందర్, పిట్ట సుధీర్ మరియు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారు కార్లర్స్ మార్క్ నగర్ నుంచి లింగస్వామి జున్ను కుమార్ రాపర్తి కరుణాకర్ రాపర్తి శ్రీనివాస్ ఇమ్మడి తిరుపతి రాము నాయక్ మరపాక మహేష్ ఎన్టీఆర్ నగర్ నుంచి లాగల బిక్షపతి, సంగేపు రవికుమార్, పల్లెపాటి రమేష్ రెడ్డి, కలకోట్ల వినోద్ కుమార్, బాలాజీ నగర్ నుంచి ఇనుముల బాబు, రవీందర్, పత్రి బాబయ్య పత్రం గురుమూర్తి గంధం పరమేష్ గంధం సారంగపాణి, కడ మంచు కుమార్, గంధం శ్రీను, పత్రి లక్ష్మణ్, సాయి గణేష్ కాలనీ నుంచి సుశీల, కొండ భాగ్య, కల్పన, లలిత, రమ్యశ్రీ, పద్మ, సంధ్య మహిళలు యువత నాయకులు పెద్ద ఎత్తున పార్టీలో చేరడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!