BRS Leader Vikram Celebrates Birthday with Workers
బిఆర్ఎస్ నాయకుడు విక్రమ్ జన్మదిన వేడుకలు
ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ,పండ్లు పంపిణీ
పరకాల నేటిధాత్రి
మండలం నాగారం గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు గుండెబోయిన విక్రమ్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా శనివారం గ్రామంలో ఉపాధి హామీ ప్రజల సమక్షంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో నాగారం గ్రామ మాజీ సర్పంచ్,పరకాల మాజీ పీఏసీఎస్ చైర్మన్ గుండెబోయిన నాగయ్య, గ్రామ సర్పంచ్ ఏరుకొండ రమాదేవి శ్రీనివాస్,మాజీ ఎంపీటీసీ ఏరుకొండ సంతోష్, వార్డు సభ్యులు తూముల ప్రవీణ్,జాలిగపు రాజు,తిరుపతి,గొట్టె అనిల్ ,పైడిపాలశ్రీధర్ తదితర నాయకులు,కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విక్రమ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.పుట్టినరోజు సందర్భంగా సుమారు 200 మందికి అరటిపండ్లు,చల్లా పంపిణీ చేశారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేయడం తన లక్ష్యమని విక్రమ్ తెలిపారు.రైతులు, శ్రమజీవులు,నిరుపేదలకు అండగా నిలుస్తూ ప్రజా సమస్యలపై స్పందించే యువ నాయకుడిగా ఆయన సేవలను పలువురు ప్రశంసించారు.
