మందమర్రి, నేటిధాత్రి:-
జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో చెన్నూరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే బాల్క సుమన్ కారు గుర్తుకు ఓటేసి, అధికం మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పట్టణంలోని 5వ వార్డు తదితర వార్డులలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి ఇంటికి తిరుగుతూ, ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వందల, వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు నిర్వహిస్తున్నారని, మరల బాల్క సుమన్ ఎమ్మెల్యేగా గెలిస్తే, మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరించారు. బిఆర్ఎస్ మ్యానిఫెస్టోను, హామీలను, వివరిస్తూ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజలు తెలియజేస్తూ, కరపత్రాలు పంపిణీ చేస్తూ, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటు వేయలని ప్రచారం నిర్వహించారు. అదేవిధంగా నవంబర్ 7న పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించు ప్రజా ఆశీర్వాద సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతున్నారని, ఈ సభకు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు.