హసన్ పర్తి/ నేటి ధాత్రీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్తల కుటుంబానికి పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన అరూరి
గ్రేటర్ వరంగల్ 65 మరియు 66 వ దివిజన్ హసన్ పర్తి మరియు సుబ్బయ్యపల్లి గ్రామాలకు చెందిన బిఅర్ఎస్ పార్టీ కార్యకర్తలు అరేపల్లి సుధాకర్ మరియు చుంచు రవి లు రోడ్డు ప్రమాదoలో మృతి చెందగా బిఅర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ సభ్యత్వం ద్వారా వారికి మంజూరు అయిన 4 లక్షల రూపాయల చెక్కులను స్వయంగా వారికి గడపలకు వెళ్లి బాధిత కుటుంబాలకు అందజేసిన బి అర్ ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు వర్ధన్నపేట నియోజకవర్గ మాజి శాసనసభ్యులు ఆరూరి రమేష్.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ఇటీవల రోడ్డు ప్రమాదంలో బి అర్ ఎస్ పార్టీ కార్యకర్తలు చుంచు రవి మరియు అరేపల్లి సుధాకర్ గార్లు మృతి చెందడం బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ తరుపున వారి కుటుంబాన్ని ఆదుకుంటామని అన్నారు అధికారం శాశ్వతం కాదని పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను కాపాడుకోవడమే బిఆర్ఎస్ పార్టీ ఎజెండా అని అందుకే వారి పార్టీ ఇన్సూరెన్స్ సభ్యత్వం ద్వారా మంజూరు 4 లక్షల రూపాయల చెక్కులను ఈరోజు బి ఆర్ ఎస్ పార్టీ అధినేత కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబాలకు అందజేయడం సంతోషంగా ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.