‘‘బిఆర్‌ఎస్‌’’ బలమేమిటో చూపిస్తాం!

రజతోత్సవ సభ కాంగ్రెస్‌, బిజేపిల గుండెలదిరేలా నిర్వహిస్తాం.

తెలంగాణ ప్రజలు బిఆర్‌ఎస్‌ వెంటనే వున్నారనేది రుజువు చేస్తాం.

‘‘బిఆర్‌ఎస్‌’’ పార్టీ రజతోత్సవ సభను కాంగ్రెస్‌, బిజేపిల గుండెలదిరిపోయేలా నిర్వహిస్తామంటున్న తెలంగాణ ఉద్యమ కారుడు, ఖైరతాబాద్‌ ‘‘బిఆర్‌ఎస్‌’’ ఇన్‌ చార్జ్‌ ‘‘మన్నె గోవర్ధన్‌ రెడ్డి’’, నేటిధాత్రి

ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో సభ సమయం దగ్గర పడుతున్న వేళ పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…

`కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కసిగా వున్నారో వరంగల్‌ సభతో చూస్తారు.

`ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎంతుందో తెలుసుకుంటారు.

`ఏమరపాటు ఎంత నష్టం చేసిందో ప్రజలు తెలుసుకున్నారు.

`కేసిఆర్‌ ను దూరం చేసుకొని ఎంత మధనపడుతున్నారో చూస్తూనే వున్నారు.

`కేసిఆర్‌ కు తెలంగాణ మీద వున్న మమకారం మరెవ్వరికీ లేదు.

`కేసిఆర్‌ అంటేనే తెలంగాణ… తెలంగాణ అంటేనే కేసిఆర్‌.

`బిఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ మరింత పదిలంగా వుంది.

`టిఆర్‌ఎస్‌, బిఆర్‌ఎస్‌ వేరువేరు కాదు.

`కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు.

`తెలంగాణ ప్రజల్లో ఎవరికీ అపోహలు లేవు.

`కాంగ్రెస్‌, బిజేపి నాటకాలు ఇక చెల్లవు.

`ఇకపై తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ మాట తప్ప మరెవ్వరి మాట వినరు.

`తెలంగాణ ప్రజలంతా బిఆర్‌ఎస్‌ వైపే వున్నారు.

`ఇక భవిష్యత్తులో కాంగ్రెస్‌, బిజేపిలకు చీమకాలంత కూడా చోటుండదు.

`తెలంగాణ అంతా గులాబీ మయమే!

`మరో ఇరవై సంవత్సరాలు బిఆర్‌ఎస్‌ కు ఎదురుండదు.

`కేసిఆర్‌ నాయకత్వాన్ని ఢీ కొట్టే దమ్ము ఎవరికీ లేదు.

`రజతోత్సవ సభ ఎప్పుడెప్పుడా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

`జిల్లాల నుండి ఎడ్లబండ్లు కట్టుకొని లక్షలాది మంది రైతులు ఇప్పటికే బయలు దేరారు.

`ఇక కాంగ్రెస్‌ మీద రణమే..ఎన్నికల దాకా రణరంగమే!

                            హైదరాబాద్‌,నేటిధాత్రి:  

వాపును చూసి బలుపు అనుకుంటున్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీకి, లేని బలాన్ని అతిగా ఊహించుకుంటున్న బిజేపిలకు ఒకేసారి బిఆర్‌ఎస్‌ పార్టీ సత్తా ఏమిటో..తెలంగాణ జాతి పిత కేసిఆర్‌ బలమేమిటో వరంగల్‌ రజతోత్సవ సభతో నిరూపిస్తాం. ఇప్పటికే ప్రజలు తండోపతండాలుగా వచ్చేందుకు సిద్దమౌతున్నారు. కొన్ని జిల్లాల నుంచి రైతులు స్వచ్చంధంగా కొన్ని వేల మంది రైతులుఎడ్ల బండ్ల ద్వారా బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు హజరై బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదించాలనుకుంటున్నారు. చిన్న ఏమరపాటు చేసిన పొరపాటు వల్ల తెలంగాణ రైతాంగం ఎంత ఆగమైందో స్వయంగా రైతులే వరంగల్‌ సభకు హజరైన చెప్పాలనుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గుణపాఠం చెప్పాలని చూస్తున్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభను కాంగ్రెస్‌,బిజేపి పార్టీల గుండెలదరిలా నిర్వహిస్తామని ఖైరతాబాద్‌ బిఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి, తెలంగాణ ఉద్యమ కారుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు మన్నెగోవర్ధన్‌రెడ్డి , నేటి ధాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో రజతోత్సవ సభ సమయం దగ్గర పడుతున్న వేళ, అందిస్తున్న సమాచారం ఆయనమాటల్లోనే…

దేశ రాజకీయాల్లోనే బిఆర్‌ఎస్‌ది ఒక గొప్ప చరిత్ర. అటు ఉద్యమ చరిత్ర, ఇటు రాజకీయ చరిత్ర రెండూ కలిసిన ఏకైక పార్టీ బిఆర్‌ఎస్‌. అందుకే తెలంగాణ ప్రజల్లో నిండి వుంది. ఆ బలమేమిటో, ప్రజల గుండెల్లో కేసిఆర్‌ స్ధానమేమిటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పే రోజు దగ్గర్లోనే వుంది. తెలంగాణ ప్రజలంతా కేసిఆర్‌ నాయత్వమే కావాలని బలంగా ఎంత కోరుకుంటున్నారో మూడు రోజుల్లో ప్రపంచం చూస్తుంది. బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందని లేనిపోని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ స్ధానం తెలంగాణలో ఎక్కడుతో తేలుతుంది. పది నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తెలంగాణ ప్రజలు తిరుగబాటు చేయడం మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరిసిస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఏ ప్రభుత్వాన్ని తిట్టనన్ని తిట్లు, ప్రజలు కాంగ్రెస్‌ ఫ్రభుత్వాన్ని తిడుతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే కేసిఆర్‌ పాలనలో అందిన సంక్షేమ కార్యక్రమాలకు మంగళం పాడారు. రైతు బందుకు రాం..రాం చెప్పారు. దళిత బంధుకు ఎగనాం పెట్టారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దిక్కులు చూస్తున్నారు. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులను, కార్యకర్తలనువేధిస్తున్నారు. ప్రజలను గోసూ పెడుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో హైడ్రాపేరిట జరుగుతున్న దౌర్జన్యంతో ప్రజలు ఉపాదికోల్పోతున్నారు. ముప్పై ఏళ్ల క్రితం, నలభై ఏళ్ల క్రితం కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తున్నారు. వారికి గూడులేకుండా తరిమేస్తున్నారు. బుల్డోజర్లు తెచ్చి కూల్చేస్తున్నారు. రాత్రికి రాత్రి సామాన్యుల జీవితాల్లో కాళ రాత్రులు నింపుతున్నారు. వారి జీవితాలను బజారున పడేస్తున్నారు. ప్రజలను ఆగమాగం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద ప్రజలు ఎంత కసిగా వున్నారో వరంగల్‌ సభ ద్వారా తేలిపోనున్నది. ప్రజల ఆసక్తిని చూస్తుంటే గతంలో వరంగల్‌లో జరిగిన మహాగర్జనను మించి సభ జరుగుతుందనిపిస్తోంది. సభలు అంటేనే బిఆర్‌ఎస్‌. బిఆర్‌ఎస్‌ నిర్వహించిన సభలను అదిగమించిన సభలు ఏ పార్టీకి ఇప్పటి వరకు సాద్యం కాలేదు. ప్రజల్లో వున్న ఆదరణ ఎంత గొప్పదో బిఆర్‌ఎస్‌ పార్టీకి తెలుసు. తెలంగాణ ప్రజలకు తెలుసు. అందుకే బిఆర్‌ఎస్‌ సభలు అంటేనే ప్రజలు తండోప తండాలుగా వస్తారు. ఇసుకేస్తే రాలనంత జనం ఎప్పుడూ వస్తారు. ఆ మధ్య జరిగిన కొంగరకలాన్‌ సభను చూసే కాంగ్రెస్‌, బిజేపిల గుండెలు బెదిరిపోయాయి. ఇప్పుడు వరంగల్‌ రజతోత్సవ సభను చూసి ఆ రెండు పార్టీలు అదిరిపోవాల్సిందే.. కేసిఆర్‌ను దూరుం చేసుకొని ప్రజలు మధనడుతున్నారు. సాఫీగా సాగుతున్న పాలనను కాదకున్నందకు నరకం అనుభవిస్తున్నామని చెబుతున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు వారిని పట్టుకొని ఏడుస్తున్నారు. మళ్లీ మా కేసిఆర్‌ పాలన కావాలని కోరతున్నారు. ఇకపై మళ్లీ కాంగ్రెస్‌ను నమ్మే ప్రసక్తి లేదంటున్నారు. సందిట్లో సడేమియాలాగా ఒంటె పెదవుల కోసం నక్క ఆశపడినట్లు బిజేపి ఆశపడుతోంది. కాంగ్రెస్‌ అడినట్లే ఒక్క అవకాశంటూ జనం ముందుకు వస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా వుండాలి. ఇప్పటికే తెలంగాణ మళ్లీ యాభై ఏళ్లు వెనక్కి వెళ్లింది. మరోసారి పొరపాటు చేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తుంది. ఎందుకంటే ఎనమది మంది బిజేపి ఎంపిలను తెలంగాణ ప్రజలు గెలిపస్తే కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలేదు. అలాంటి పార్టీని నమ్మితే మళ్లీ మోసపోతామని ప్రజలే అంటున్నారు. ఆ రెండు పార్టీల నాయకులను దగ్గరకు కూడా రాన్విడం లేదు. ఎందుకంటే కేసిఆర్‌..కేసిఆరే…ఆయనకు వున్న ఆత్మ మరేపార్టీకి లేదు. మరే పార్టీ నాయకులకు వుండదు. ఎందుకంటే తెలంగాణను కేసిఆర్‌ పద్నాలుగేళ్లు కొట్లాడి తెచ్చారు. కేసిఆర్‌ చేసిన త్యాగ ఫలితమే తెలంగాణ. కేసిఆర్‌ లేకుంటే తెలంగాణ లేదు. వచ్చేదే కాదు. ప్రజల తెలంగాణ కల కలగానే మిగిలిపోయేది. తెలంగాణ మరింత ఆగమయ్యేది. తెలంగాణ ప్రజలు ఉమ్మడి రాష్ట్రంలో ద్వితీయ శ్రేణీ పౌరులుగానే మిగిలిపోయేవారు. తెలంగాణ మరింత ఎడారిగా మారిపోయేది. పల్లెల ఆకృతిమరింత క్షీణించేది. తెలంగాణలో రైతులు అనిచెప్పుకునేవారు లేకుండాపోయేవారు. ఎందుకంటే కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీ హాయంలో తెలంగాణ రైతులు ఎంతో మంది అప్పార్టుమెంట్లలో వాచ్‌ మెన్‌లుగా పనిచేశారు. యాభై ఎకరాలున్న రైతులు కూడా ఏటిఎంల మందు, ఇతర షపుల ముందు వాచ్‌మెన్‌ పనులు చేశారు. తెలంగాణ పల్లెల్లో ఎంతో గౌరవంగా బతికిన రైతు కూడా హైదరాబాద్‌ వచ్చి హోటళ్లలో పనిచేసిన వాళ్లు కొన్ని వేల మంది వున్నారు. మరి కొంత మంది సాగుమీద ఆశతో, వ్యవసాయం మానుకోలేక, భూమిని అమ్ముకోలేక నష్టాలను, కష్టాలను ఓర్చుకుంటూ, ఏటా అప్పులు చేస్తూ కష్టాల సాగు చేశారు. లక్షల రూపాయలు ఖర్చుపెట్టి బోర్లు వేయించి, అప్పుల పాలయ్యారు. వాటిని తీర్చుకునేందుకు హైదరాబాద్‌లో కూలీలుగా మారిపోయారు. మరి కొందరు బొంబాయి, షోలాపూర్‌, పూన వంటి నగరాలకు పొట్ల చేత్తో పట్టుకొని వలసలు పోయేవారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి మహారాష్ట్రలకు నిత్యం బస్సుల్లో వందల సంఖ్యలో వలసలుపోయిన రోజులు వున్నాయి. కాని కేసిఆర్‌ తెలంగాణ తేవడంతోనే దశ మారింది. రైతుల జీవితాల్లో వెలుగులొచ్చాయి. వలసలు పోయిన లక్షలాది మంది రైతులు మళ్లీ తమ తమ పల్లెలకు చేరుకున్నారు. దశబ్ధాల తరబడి వదిలేసిన భూములను మళ్లీ సాగుయోగ్యం చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసిఆర్‌ పాలనకు వచ్చిన మూడు నెలల్లోనే 24 గంటలు కరంటు వస్తుందని తెలిసి తెలంగాణ సంబురాలుచేసుకున్నారు. తెలంగాణలోని చెరువులన్నీ నింపుతున్నారని తెలిసి, బతపోయిన రైతులంతా మళ్లీ పల్లెలు చేరుకున్నారు. పాడుబడిపోయిన బావుల్లో కూడా నీటి ఊటలు జలపాతాల్లా వస్తుంటే చూసి ఆనందంతో గంతేలేశారు. మళ్లీ తెలంగాణ రైతులు ఆత్మగౌరవంతో బతికే రోజులు చూసి మరిసిపోయారు. సాగు వాటు కోసం ఏ షావుకారు దగ్గరకో, అప్పులు ఇచ్చేవారినో బతిమిలాడుకునే పరిస్దితి లేకుండా కేసిఆర్‌ రైతుబంధు ఇచ్చారు. దాంతో రైతుల్లో ఎంతో ధైర్యం పెరిగింది. మనకు ఏమైనా సరే కేసిఆర్‌ చూసుకుంటారన్న నమ్మకంతెలంగాణ రైతుల్లో వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో పండిన పంటను కొనాలంటే దళారులు, మధ్య వర్తులు, మిల్లర్లు లేనిపోని కొర్రీలు పెట్టేవారు. ఎంత మంది వడ్లనైనా అడ్డికిపావు శేరుకు కొనుక్కునేవారు. డబ్బులకు తిప్పించుకునేవారు. కాని కేసిఆర్‌ వచ్చిన తర్వాత వడ్లలలో పెళ్లలలున్నా, ఒడిపిల్లున్నా, వడ్లు తడిసినా, రంగు మారినా, మొలకలు వచ్చినా సరే ప్రభుత్వమే నేరుగా రైతులను వడ్లు కొనుగోలు చేసింది. రైతులునష్టపోకుండా కేసిఆర్‌ కాపాడారు. దాంతో పదేళ్ల కాలంలో ఏనాడు రైతునష్టపోయింది లేదు. దళారుల చేత కాకుండా, రైతులకు ప్రభుత్వమే నేరుగా బ్యాంకు అకౌంట్లలో వడ్ల సొమ్ము వేసేది. దాంతో రైతుకు రూపాయి కూడా నష్టం జరిగేది కాదు. ప్రభుత్వమే మహిళా సంఘాల ద్వారా ఐకేపి సెంటర్లు ఏర్పాటు చేసి వడ్లు కొనుగోలు చేయడం అన్నది దేశంలో ఎక్కడా లేదు. కేవలం తెలంగాణలో మాత్రమే వుండేది. దాంతో తెలంగాణలో పండిన వడ్లే కాకుండా, ఇతర రాష్ట్రాల రైతులు కూడా తెలంగాణకు వచ్చి, మ్ముకున్నారు. లాభపడ్డారు. రైతు బాంధువుడుగా కేసిఆర్‌ పేరు తెచ్చుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!