దివ్యాంగులకు అండగా బిఆర్ఎస్ ప్రభుత్వం

మరిపెడ నేటి దాత్రి.

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని భార్గవ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డోర్నకల్ నియోజకవర్గ దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతు దివ్యాంగుల ఆత్మబంధువు కేసీఆర్ అన్నారు, ఒక్క పెన్షన్లు పెంచడమే కాకుండా మన గురించి ఆలోచించి అనేక సంక్షేమ పథకాలు,సహాయ ఉపకరణాలు ఉచితంగా అందిస్తున్నా ఏకైక సీఎం మన కేసీఆర్ అన్నారు,పెన్షన్లు వివిధ దఫాలుగా పెంచినటువంటి ఘనత మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు, మూడోసారి ముఖ్యమంత్రిగా బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు,దివ్యాంగులకు మొదట రూ. 500 ఉన్న పెన్షన్లు ఏకంగా రూ.4016 పెంచిన ఘనత కేసీఆర్ దే అన్నారు, రాబోయే ప్రభుత్వంలో రూ. 6000 పెంచేందుకు కేసీఆర్ హామీ ఇచ్చారని అన్నారు.గడిచిన తొమ్మిది సంవత్సరాలలో వికలాంగుల పెన్షన్లకు దాదాపు రూపాయలు రూ.10,300 కోట్లు కేటాయించారని ఆ ఘనత సీఎం కెసిఆర్ కు దక్కుతుందన్నారు,అనేక సంక్షేమ పథకాలు ఆర్థిక ప్రోత్సాహకాలతో వికలాంగుల జీవితాల్లో వెలుగు నింపింది బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అన్నారు, బీఆర్ఎస్ పార్టీకి వికలాంగులు అండగా ఉండి మూడవసారి మళ్లీ కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసుకోవలని కోరారు.డోర్నకల్ నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే డి.ఎస్ రెడ్యా నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు పెన్షన్ సరిపోయేంత ఇవ్వలేదని అన్నారు,కనీసం వారి అవసరాలు కూడా తీరే పరిస్థితి అప్పట్లో లేదని అన్నారు.పెన్షన్ల పెరుగుదల కోసం అప్పుడు వికలాంగులు అందరూ ధర్నా చేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ,వారికి మద్దతుగా నిలబడి పోరాడానన్నారు.కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చాక వికలాంగులు ఆత్మగౌరవంతో ఉన్నారని మళ్ళీ బి.అర్.ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఎన్నికల తర్వాత రూ.6 వేల రూపాయలు వరకు పెన్షన్ ను అందిస్తామని చెప్పిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఇదే కాకుండా దివ్యాంగులకు సంక్షేమ పథకాల్లో 5%, ఉద్యోగాల్లో 4% రిజర్వేషన్ కల్పిస్తూ, అండగా ఉన్నటువంటి ప్రభుత్వానికి దివ్యాంగులంతా అండగా ఉండాలన్నారు.ఇప్పటికే మీ అందరి ఆశీర్వాదంతోని, 6 సార్లు గెలిచాను,మళ్లీ మీరందరూ ఆశీర్వదిస్తే మన నియోజకవర్గంలో 7వ సారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న, మిమ్మల్ని చూస్తే అత్యధిక మెజారిటీతో గెలుస్తాననే ధీమాను వ్యక్తంగా ఉంది.గతంలో కన్నా ఇ సారి ఎక్కువ మెజారిటీతో గెలుస్తా,కాంగ్రెస్, బిజెపి అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్నప్పటికీ ఇంత గొప్పగా సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లేవు.దేశ ప్రజలందరూ కేసీఆర్ వైపు
తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నారు, తెలంగాణ మోడల్ ను కోరుకుంటున్నారు,ఒక్కొక్క వ్యక్తి ఒక్కో కేటీఆర్ ల, విస్తృత ప్రచారం చేసి బిఆర్ఎస్ పార్టీనీ అధికారంలోకి తేవాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు,ఎంపీపీ అరుణ రాంబాబు,జెడ్పిటిసి శారద రవీందర్,మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్,మున్సిపల్ చైర్ పర్సన్ సింధూర రవికుమార్, కేసముద్రం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాంపల్లి రవి గౌడ్, డోర్నకల్ మున్సిపల్ చైర్మన్ వీరన్న,రవి నాయక్,డోర్నకల్ ఎంపీపీ బాలు నాయక్,మండల బి.ఆర్ ఎస్ అధ్యక్షులు రామ సహాయం సత్యనారాయణ రెడ్డి,నున్న రమణ,ఒడిసిఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి,బజ్జూరి పిచ్చి రెడ్డి,గొర్ల సత్తి రెడ్డి,తోట లాలయ్య,రాంసింగ్ నాయక్,రామ్ లాల్, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు అజ్మీరా రెడ్డి,మాజీ సర్పంచ్ దూస నర్సయ్య,గంధసిరి కృష్ణ,ఉప్పల నాగేశ్వరరావు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!