
భద్రాచలం నేటి ధాత్రి
త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా భద్రాచలం లో జరగనున్న టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశమునకు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు . పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ . కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. ముఖ్య అతిథులుగా హాజరవుతారని బిఆర్ఎస్ పార్టీ నేత రావులపల్లి రాంప్రసాద్ తెలిపారు….
ఈనెల మూడవ తేదీన భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగే నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.. అనంతరం రావుల పల్లి మాట్లాడారు…
ఇప్పటికే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ లపై .వాటి అమలుపై ప్రజల విశ్వాసం కోల్పోయిందని కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఆరు గ్యారెంటీలు అమలు అవుతాయని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పటం విడ్డూరంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం లేని లోటు ప్రజలకు అప్పుడే అర్థమవుతుందని. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోవడం ఖాయమని పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా గులాబీ సైన్యం కృషి చేసే విధంగా జరిగే సన్నాహా సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో భద్రాచలం మండల అధ్యక్షులు అరికెళ్ల తిరుపతిరావు. ఆకోజు సునీల్ కుమార్. తాండ్ర నరసింహారావు. కోటగిరి ప్రబోధ్ కుమార్. కోలా రాజు. డానియల్ ప్రదీప్. కాపుల నవీన్ .తదితరులు పాల్గొన్నారు….