ప్రజా ఆశీర్వాద సభ”ఏర్పాట్లను పర్యవేక్షించి పనుల్ని మరింత వేగవంతం చేయాలని ఆదేశించిన. ఎంపీ రవిచంద్ర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
ఇల్లందు నియోజకవర్గ.ఎంపీ రవిచంద్ర
రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జి వద్దిరాజు రవిచంద్ర సోమవారం ఉదయం ఇల్లందులో పర్యటించారు.వచ్చే నెల ఒకటవ తేదీన (ఎల్లుండి బుధవారం) బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు “ప్రజా ఆశీర్వాద సభ”జరుగనున్న నేపథ్యంలో ఎంపీ రవిచంద్ర సభాస్థలిని, హెలిప్యాడ్ పనుల పురోగతిని పరిశీలించారు, పర్యవేక్షించారు.సభ నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి కొనసాగుతున్న పనులను మరింత వేగవంతం చేయాల్సిందిగా ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్ తదితరులకు ఎంపీ వద్దిరాజు పలు సూచనలు చేశారు, సలహాలిచ్చారు.పనుల్లో నిమగ్నమైన సిబ్బందికి ఎంపీ రవిచంద్ర తగు ఆదేశాలిచ్చారు.