Win Vinoda Balaraju with a Huge Majority
బిఆర్ఎస్ అభ్యర్థి వినోదా బాలరాజును భారీ మెజారిటీతో గెలిపించాలి
◆:- జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు
◆:- పంచాయతీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మంగళవారం ఝరాసంగం మండల గ్రామంలో ఇంటింటి కడప కడప బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి వినోద బాలరాజ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిస్తేనే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేరుతాయని ఆయన అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఇటీ ప్రచార భాగంలో మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ గ్రామ అధ్యక్షులు ఎజాస్ బాబా నాగన్న పటేల్ గడ్డం అనిల్ శీను పటేల్ సజ్జన్ నాగేశ్వర్ సద్దాం హుస్సేన్ షేక్ సజావుద్దీన్ సంగమేశ్వర్ పప్యా ఠాకూర్ సంజు ఠాకూర్ మరియు తదితరులు పార్టీ కార్యకర్తలు పార్టీ పెద్దలు పాల్గొన్నారు
