
*ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్
*బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు ప్రజలతో జనసముద్రమైన చొప్పదండి
*భారీగా తరలివచ్చిన శ్రేణులు
*స్టెప్పులేసిన బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్
*కాంగ్రెస్ కు ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది
*బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ విజయం తథ్యం
*కారు గుర్తుకు ఓటు వేసి సౌమ్యుడు, స్థానికుడు రవిశంకర్ ను గెలిపించాలి
*రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్
బోయినిపల్లి, నేటి ధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వినోద్ కుమార్ మాట్లాడుతూ చొప్పదండి నియోజకవర్గం లో మూడు వైద్య కళాశాలలు ఉన్న స్థాయి నుంచి స్వరాష్ట్ర తెలంగాణలో 33 జిల్లాలకు 33 వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం సువర్ణ అధ్యాయం.
దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు సువర్ణ అవకాశం.
గతంలో వైద్య విద్యను అభ్యసించాలంటే అనేక ఆర్థిక ఇబ్బందులు ఉండేటివి.
ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుచూపుతో దూరదృష్టితో జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం వల్ల సంవత్సరానికి 10000 మంది వైద్యులు బయటకు వస్తారు.
దీని ద్వారా పేద ప్రజలకు ఉచిత, మెరుగైన వైద్యం అందుతుంది.
తెలంగాణ విద్యార్థులకు వైద్యవిద్యను చేరువ చేయాలన్న ఆశయంతో సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసారు.
ఏకకాలంలో 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీల తరగతులను ప్రారంభిస్తూ తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సృష్టిస్తున్నది.
స్వాతంత్య్రానంతరం ఏడున్నర దశాబ్దాలలో వైద్య విద్యలో ఎన్నడూ, ఎక్కడా జరుగని అద్భుతాన్ని తెలంగాణలో ఆవిష్కరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సుదీర్ఘకాలం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం వల్ల తెలంగాణ ప్రజలకు ఎనలేని మేలు చేకూరిందనడానికి వైద్య విద్యలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులే ప్రబల నిదర్శనం.
లక్షలు పోసినా దొరకని సీట్లు ఇవాళ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. పేదింటి బిడ్డలు కూడా ఎంబీబీఎస్ చదివి డాక్టర్ పట్టా పొందే అవకాశం కల్పించారు. మెడికల్ సీట్లను అనేకరెట్లు పెంచడం ద్వారా దేశంలో తెల్లకోటు విప్లవం తీసుకొచ్చారు.
కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వాసుపత్రుల్లో కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తెచ్చారు.
రాష్ట్రానికి సీఎంగా కేసీఆర్ ఉండడం వల్లే ఇవాళ మనం ఆరోగ్య తెలంగాణ లక్ష్య సాధన దిశగా దూసుకుపోతున్నాం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితుల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు.దళితులు పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు ప్రభుత్వం తరఫున ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది.ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి దళిత బిడ్డలు చదువుకునేందుకు ప్రభుత్వం తరఫున ప్రతి విద్యార్థి పై లక్షా 25 వేల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేస్తుంది.
అంబేద్కర్ విదేశీ విద్యా విధానం ద్వారా 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసి విదేశాల్లో చదువుకునే విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుంది.
దళిత బిడ్డలు ఐఏఎస్ ఐపీఎస్ లుగా, సివిల్స్‌లో ఉద్యోగం సాధించేందుకు ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది.