నేటిధాత్రి గీసుకొండ:-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని బి ఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి గారి సతీమణి జ్యోతి గారు అన్నారు. బుధవారం దామెర మండలం కోగిలవాయి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గ్రామ మహిళలు జ్యోతి గారు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జ్యోతి గారు మాట్లాడుతూ…కుల మతాలు, రాజకీయాలకు అతీతంగా సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు.ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గుర్తుంచుకోవాలని అన్నారు. గత పాలకుల పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, గ్రామ నాయకులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.