BRS Candidate Maganti Sunitha’s Win Certain
బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కాయం
భూపాలపల్లి నేటిధాత్రి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత కారు గుర్తు పై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరుతూ యూసుఫ్ గూడ డివిజన్లో ఇంటింటి ప్రచారం నిర్వహించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులతో కలిసి నేడు ఇంటింటి ప్రచారం చేస్తే ప్రజలు మాకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు అన్నారు
ముఖ్యమంత్రి మాట చెప్పితే ప్రజలు మాకు మంచి జరుగుతుంది అని నమ్మేవారు…
కానీ నేటి ముఖ్యమంత్రి దేవుళ్ళ మీద ఓట్లు వేసి దేవుళ్ళనే మోసం చేసిండు మనం ఎంత అంటూ తిట్ల దండకం వల్లిస్తున్నారు.
పోటీ చేయడానికి అభ్యర్థి దొరక్క మజ్లిస్ పార్టీ నుండి పార్టీలోకి తీసుకుని నేర చరిత్ర కలిగిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.
ఒక్క వర్గం ఓట్ల కోసం ఒక్క చెల్లని వ్యక్తి గతంలో పోటీ చేసిన వ్యక్తికి ప్రజలు తిరస్కరించిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి మేము గెలుస్తున్నాం అని చెప్పుకోవడం సిగ్గుచేటు.. అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
