భూపాలపల్లి మున్సిపాలిటీ పై బిఆర్ఎస్ జెండా ఎగురవేయాలి
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ
బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన భూపాలపల్లి పట్టణంలోని 9వ వార్డులో నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటే అధికార పార్టీకిచ్చే సరైన సమాధానం కావాలి.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమ ఓటు శక్తితో అధికార పార్టీ వైఫల్యాలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు…
