
.ముక్యకార్యకర్తల సమావేశంలో కార్యకర్తలకు పిలుపునించిన పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు పిలుపు
భద్రాచలం నేటి ధాత్రి
దుమ్ముగూడెం. సోమవారం ఈరోజు మండలంలోని మరాయిగూడెం లో 6 బూతులు,తురుబాకలో 5 బూతులు కొత్తూరులో 2, బూతుల కమిటీ ముఖ్యకార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మాట్లాడుతూ అబద్ధపు అమలుకాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హామీలను అమలు చేయలేక గతప్రభుత్వం పై బురద చల్లుతున్నదని గతంలో KCR చేసిన అభివృద్ధిని తెలంగాణా లో ఏ గ్రామంలోకి వెళ్లిన కనిపిస్తుంది అని 60 ఏండ్లుగా గ్రామాలు మంచినీళ్లు లేక అల్లాడేవని కరెంట్ కష్టాలు ఉండేవని కానీ పోరాడితెచ్చుకున్న తెలంగాణలో కరెంట్ కష్టాలు లేకుండా మంచినీటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండ కంటికి రెప్పలా కాపాడుకున్నారని అదే అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రేస్ ప్రభుత్వం లో మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ను ఏవిధాగా అయితే వివక్షతకు గురిచేసిందో అదే పద్దతిలో తెలంగాణ ఢిల్లీ గులాములకు తాకట్టు పెట్టిందని గతంలో కేంద్రమంత్రిగా ఉన్న మహాభూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన నియోజక వర్గం లో భాగమేనా భద్రాచలం పినపాక నియోజకవర్గాలకు అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం పెరుతోటి అప్పటి కేంద్ర మంత్రి అయిన జైరామ్ రమేష్ అధ్యక్షతన ఏర్పడిన ఆర్డినెన్స్ కమిటీ అన్యాయంగా 7మండలాలను ఆంధ్రాకు కట్టపెడుతుంటే ఈ నియోజకావొర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి కేంద్ర మంత్రి ఇప్పటి కాంగ్రెసుపార్టీ అబ్యర్ధి ఏమొకం పెట్టుకొని భద్రాచలం పినపాక నియోజక వర్గాల ప్రజలను ఓట్లు అడగటానికి వస్తున్నాడు అని ఈప్రాంతానికి తీరని నష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం లొనే అని .అదే BRS పార్టీ అభ్యర్థి మాలోత్ కవిత నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటూ పార్లమెంట్ లో తెలంగాణా కు జరుగుతున్న అన్యాయాన్ని నిత్యం ఎండగడుతూ కెసిఆర్ సూచనల సలహాలతో BJPఅవలంభిస్తున్న ప్రజా వెతిరేక విధానాలపై పార్లమెంట్ ను స్తంభింపచేసారని మన బాణీని వినిపించే మలోత్ కవిత గెలుపుకొఱకు అందరూ కృషిచేయాలని అన్నారు ఈకార్యక్రమంలో నియోజక వర్గ నాయకులు మనే రామకృష్ణ.సీనియర్ నాయకులు సాగి శ్రీని వాసు రాజు,అధ్యక్ష కార్యదర్శులు అన్నే సత్యనారాయణ మూర్తి, కణితి రాముడు, ఎంపిపి రేసు లక్ష్మి,ఉపాధ్యక్షులు తునికి కామేష్, అపక.వీర్రాజు.మాజీ సర్పంచులు సోడి కొండయ్య,కటిబోయిన వెంకటేశ్వర్లు,నాయకులుబొల్లి వెంకట్రావు ,కొత్త మల్లేష్, అపక శ్రీను,వెంకటేష్, కంజ నాగేశ్వరావు,పొడియం సుబ్బారావు,పాయం వెంకటేశ్వర్లు, కర్సం రాజు, తదితరులు కారం వెంకటేష్,సాగి వర్మ,కల్లూరి కామేష్,మర్మం గంగరాజు,జిలకర గంగరాజు , కట్టం నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.