తంగళ్ళపల్లి నేటి ధాత్రి:
తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని 11 12 వార్డులలో స్థానిక సర్పంచ్ అనిత రవి ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి ఆధ్వర్యంలో వాడవాడల గడపగడప తిరుగుతూ కారు గుర్తుకే ఓటేసి గెలిపించాలని ప్రచారం సాగిస్తున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ప్రియతమ ముఖ్యమంత్రి అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఎంతో అభివృద్ధి చేశారని ఆసరా పెన్షన్ గాని వికలాంగుల పెన్షన్ గాని కళ్యాణ లక్ష్మి గాని రైతుబంధు గాని దళిత బందు గాని ఇలా అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో స్తిరస్థాయిగా నిలిచారని ప్రచారంలో ప్రజల్లో నుంచి వస్తున్న మంచి అపూర్వ స్పందన చూసామని ఆయన చేసిన అభివృద్ధి పథకాలే మళ్లీ గెలిపిస్తాయనిఅలాగే రాబోయే ఎన్నికల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని తెలియజేస్తూ మన ప్రియతమ మంత్రి కేటీ రామారావును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రభుత్వం ప్రవేశపెట్టిన కరపత్రాలతో ఇంటింటా ప్రచారం చేయడం జరిగిందని ఇట్టి ప్రచార కార్యక్రమంలో పార్టీ ప్రజా ప్రతినిధులుపాక్స్ వైస్ చైర్మన్ వెంకటరమణారెడ్డి వార్డు మెంబర్లు యూత్ నాయకులు పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు మైనార్టీ నాయకులు కార్యకర్తలు ఇట్టి ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది