మందమర్రి, నేటిధాత్రి:-
అంతర్జాతీయ, జాతీయస్థాయి మార్షల్ ఆర్ట్స్ పోటీల్లో పట్టణానికి ఖ్యాతిని తీసుకురావాలని పట్టణంలోని పంచముఖి ఆంజనేయ స్వామి దేవాలయ అర్చకులు శ్రీకృష్ణమాచార్యులు, సదా సేవ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సంగి సంతోష్ లు ఆకాంక్షించారు. పట్టణానికి చెందిన మార్షల్ ఆర్ట్ సాహస వీరుడు తోట రమేష్ రాజా కు హైదరాబాద్ చెందిన ప్రముఖ సంస్థచే ఆస్కార్ అవార్డు లభించగా, దేవాలయ ప్రాంగణంలో రమేష్ రాజా కు కృష్ణమాచార్యులు, సంతోష్ లు అస్కార్ మెడల్, దృవ పత్రాన్ని అందజేసి, అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తూ, మరింత మంది యువతీ, యువకులకు ఆత్మరక్షణ విద్యలో నిపుణులుగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.