Bridge on Verge of Collapse – Secretary Inspects Damage
కూలిపోయే దశలో బ్రిడ్జి
పరిశీలించిన కార్యదర్శి..
నిజాంపేట: నేటి ధాత్రి
గత నెలల క్రితం కురిసిన భారీ వర్షాలకు రోడ్లు, చెరువులు, బ్రిడ్జిలు అతలాకుతలమైన విషయం విధితమే.. నిజాంపేట మండలం నందగోకుల్, కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం ఇస్సానగర్ వెళ్లే రోడ్డు మార్గంలో గల సరిహద్దు బ్రిడ్జి వరద ఉధృతికి బ్రిడ్జి కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గుంత ఏర్పడి ప్రమాదాన్ని సంతరించుకుంది. విషయం తెలుసుకున్న గ్రామ కార్యదర్శి భాగ్యలక్ష్మి సోమవారం బ్రిడ్జి నీ పరిశీలించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు. ఈ రోడ్డు గుండా భారీ వాహనాలు వెళ్ళవద్దని సూచించారు.
