`సమాచార హక్కు చట్టం.. అధికారులకు మాత్రమే చుట్టం?
`జనం అడిగిన సమాచారం… లేదని చెప్పేస్తాం?
`సమాచార హక్కు చట్టానికి అధికారుల తూట్లు?
`ఆర్టీఐ కాపలా మానేసింది.. చేను మేయడం మొదలు పెట్టింది?
`దేశం లో పారదర్శిక పాలన సాగాలి..
`అవినీతి రహిత భారతం నిర్మాణం జరగాలి.
`రాజకీయ, ఉద్యోగ అవినీతి అంతం కావాలి!
`ప్రజలకు మెరుగైన పాలనా అందాలి?
`అవినీతి రహితంగా ప్రభుత్వ సేవలు అందాలి?
`2005లో కేంద్ర ప్రభుత్వం రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్ట్ తీసుకొచ్చింది.
`పదేళ్ల పాటు ఆ వ్యవస్థ కొంత పద్ధతి గానే కొనసాగింది?
`యాక్ట్ తెచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నంత వరకు బాగానే పని చేసింది?
`ఆ తర్వాత ఆ యాక్టుకు తూట్లు పడ్డాయి. అవినీతి ఊడలు పట్టుకుపోయాయి.
`కాంగ్రెస్ పా ర్టీ కేంద్రం లో వున్నప్పుడు అనేక అవినీతి ఆరోపణలు ఎదోర్కొన్నది.
`ఆర్ టి ఐ యాక్ట్ తెచ్చి ఒక రకంగా చెప్పాలనుకుంటే తన గోతి తానే తవ్వుకుంది?
`దేశానికి మంచి చేయాలని చూసి తనే ఇబ్బందులు కొని తెచ్చుకున్నది?
`కాంగ్రెస్ దేశంంతా అధికారంలో వున్నప్పుడు రాజకీయ అవినీతి ఆరోపణలు ఎదురుకొన్నది.
`ఇప్పుడు రాజకీయ, ఉద్యోగ వ్యవస్థలు అవినీతి లో కోరుకుపోయాయి?
`రెండు వ్యవస్థలు అవినీతిలో పోటీ పడుతున్నాయి?
`ఒక మంచి ప్రయత్నం చేసి కాంగ్రెస్ దెబ్బ తిని పోయింది?
`అధికార గణమే ఆర్ టి ఐ చట్టాన్ని అమలు చేయాలి?
`అవినీతి చేసిన అధికారే వివరాలు ఇవ్వాలి?
`ఇది సాధ్యమయ్యేది కానిదని ఆనాడు కాంగ్రెస్ ఊహించలేదు?
`ఇప్పుడు కాంగ్రెస్ భవిష్యత్తులో అధికారానికి వచ్చినా కొత్తగా చేసేదేమీ లేదు!
`చట్టాలు కఠినంగానే వున్నాయి?
`ఆ చట్టాల అమలు అధికారుల చేతుల్లోనే వున్నాయి?
`అందుకే అధికారులకు అంత ధైర్యం!
`ప్రజలు అడిగిన సమాచారం నిర్నీత గడువులో ఇవ్వాలి?
`గడువు దాటితే ఆ అధికారి మీద వేటు పడాలి?
`ఆలా ఎంత మంది అధికారుల మీద చర్యలు తీసుకున్నారు?
`అడ్డంగా డబ్బులతో దొరుకుతున్న వారికే దిక్కు లేదు?
`సమాచారం ఇవ్వని వారి మీద ఎలాంటి చర్యలు లేవు?
`ఆఖరుకు సమాచారాన్ని ఇవ్వడానికి కూడా అధికారులు లంచం తీసుకుంటున్నారు?
`ఆర్ టి ఐ యాక్ట్ ను అందరూ కలిసి సమాధి చేస్తున్నారు?
హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రజల చేతిలో సమాచార హక్కు చట్టం ఒక పాశుపతాస్త్రం. ఇది నిన్నటి మాట. ప్రజల చేతిలో సమాచార హక్కు చట్టం ఒక బ్రహ్మాస్త్రం అందరూ అనుకునే మాట. కాని అది నిజమా? కాదా? అంటే చట్టపరంగా నిజమే. కాని ఆచారణ మాత్రం శూన్యమే అని చెప్పకతప్పదు. ఎందుకంటే సమాచారం హక్కు చట్టం ఎంత పకడ్బందీగా అమలు చేస్తున్నారన్నదానిపై అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అదికారులు అడిగిన సమాచారం ఇవ్వడం లేదన్న మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఇంకాస్త ముందుకు వెళ్తే సమాచారం కావాలంటే లంచం ఇవ్వాల్సిందే అనే పరిస్దితి దాపురిస్తోందంటే అర్దమేమిటి? ఏ అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన చట్టం అమలుకు కూడా లంచాలు డిమాండ్ చేసే దాక పరిస్దితి వచ్చేసింది. వెలుగులోకి ఈ మధ్యనే ఓ అదికారి లంచం ఇస్తే తప్ప సమాచారం ఇవ్వడం కుదరదు అనే సమాదానం చెప్పి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అంటే ఇలా పట్టుబడని వారు ఎంత మంది వున్నారన్నది తెలియాల్సి వుంది. ప్రభుత్వం వీటిని పట్టించుకునే తీరికలో లేదు. రాజ్యాంగ పరంగా సమచార హక్కు కమీషర్లను ఏర్పాటు చేశామా? అంటే చేశాం..ఆ ఆక్టును అమలు చేస్తున్నామా? అంటే చేస్తున్నామన్న మాటే గాని ఎంత వరకు అమలు జరుగుతుందన్నది పట్టించుకున్న పాపాన పోలేదు. సమాచార హక్కు చట్టం కింద వచ్చిన దరఖాస్తులకు వివరాలు ఇవ్వడానికి కూడా లంచం ఆశించిన ఉద్యోగి విషయంలో సమాచార హక్కు చట్టం కమీషనర్లు ఏం చర్యలు తీసుకున్నారన్న దానిపై కూడా ఎక్కడా వార్త లేదు. అసలు వారి వరకు ఆ సమాచారం చేరిందా? లేదా? అన్నది కూడా వారు చెప్పింది లేదు. అంటే సమాచార హక్కు చట్టం ఎంత పకడ్భందీగా అమలు జరుగుతుందో ఈ ఒక్క సాక్ష్యం చాలు. సమాచార హక్కు చట్టం ఒక్క అదికారులకే చుట్టమైపోయిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి సమాచార హక్కు చట్టానికి ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే నెల రోజుల గడువులో సమాచారం ఖచ్చితంగా అందించాలి. లేకుంటే ఆ అదికారి మీద చర్యలు తీసుకోవాలి. అనే నిబందన వుంది. కాని ఇప్పటి వరకు ఎంత మంది అదికారుల మీద చర్యలు తీసుకున్నారన్నది ఎక్కడా కనిపించదు. సమాచారం ఇవ్వడమో! లేదని చెప్పడమో అనే దానిని ఆసరగా చేసుకొని అదికారులు ముఖ్యమైన విషయాలను పిర్యాధు దారుడికి చెప్పడం లేదు. సమాధానం లికిత పూర్వకంగా ఇవ్వడం లేదు. సమచారం ఇవ్వబడదు? అని కూడా రెండు ముక్కల్లో తేల్చిపడేస్తున్నారు. ఎలాంటి సమచారం ఇవ్వకూడదన్న దానిపై కూడా స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. కాని ప్రజలు అడిగే సాదాసీదా సమచారాలు కూడా ఇవ్వడం లేదు. అవినీతి అదికారుల గురించి సమాచారం చెప్పడంలేదు. పైగా భూముల ఆక్రమణలు వంటివాటిపై సమాధానాలు ఇవ్వడం లేదు. సామాన్య ప్రజలు ఎక్కువగా ఇలాంటి విషయాల మీదే సమాచారం కోరుతుంటారు. ఆ సమచారమే ఇవ్వకపోతే ఇక ఆ వ్యవస్ధ ఎందుకు? అన్యాయం జరిగిన వారు తమకు అన్యాయం జరిగిందని చెప్పుకోవద్దా? మొత్తం మీద సమచార హక్కు చట్టానికి అదికారులు దగ్గరుండి తూట్లు పొడుతున్నారు. ఆర్టీఐ అనేది సమాజంలో జరిగే అవినీతికి కాపాలా వుండాల్సిన బాద్యత. కాని ఆ కర్తవ్యం విస్మరించింది. కంచె చేను మేసే చందంగా తయారైంది. దేశంలో పారదర్శక పాలన సాగాలన్నది సమచార హక్కు చట్టం తెచ్చిన సందర్భంలో అప్పటి పాలకులు బలంగా కోరుకున్నది. కాని ఇప్పుడేం జరుగుతోంది? ఆ ఆశయం సిద్దిస్తోందా? సామాన్యులకు సమాచారం అందుతోందా? అంటే ఎవరు సమాదానం చెప్పాలి? పాలనా రంగమంతా పాదర్శకంగా వుండాలి. అవినీతి రహిత బారత నిర్మాణం జరగాలన్న ఆకాంక్షంతో 2005 అక్టోబర్ 12న కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పాలన సాగించిన యూపిఏ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్దితో ఈ చట్టం తెచ్చింది. తమ ప్రభుత్వం కూడా ఎక్కడా తప్పు చేయకుండా పాలన సాగించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్టీఐ తెచ్చింది. దేశంలో రాజకీయ, ఉద్యోగ అవినీతి అంతం కావాలన్నదే దాని ప్రధాన ఉద్దేశ్యం. పైగా దేశంలో ప్రజల భూములు కొల్లగొట్టేవారు. ప్రజా ధనం కాంట్రాక్టర్ల పేర దోడిపీ జరక్కుండా చూడడం. దేశాభివృద్దిలో ఎవరూ అవినీతికి పాల్పడకుండా చూడడం అనేది ఈ చట్టం ప్రదాన ఉద్ధేశ్యం. అవినీతి రహిత ప్రజా పాలన సాగాలని, ప్రజలకు అన్ని రకాల సేవలు ఉచితంగా అంందేందుకు అదికారులు పనిచేయాలన్నది ఆ చట్టం ఉద్దేశ్యం. ఈ చట్టం తెచ్చిన కొంత కాలం పాటు అదికారుల్లో ఒకింత భయం నెలకొన్నది. రాజకీయ నాయకుల్లో కూడా భయం పొడసూపింది. కాని అదేంటో గాని అవినీతి రహిత భారత నిర్మాణం కోసం చట్టం తెచ్చిన కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా అవినీతి ఆరోపణలు అనేకం ఎదుర్కొన్నది. ప్రజలు ఎప్పుడూ రాజకీయ అవినీతి ఆరోపణలు శ్రద్దగా వింటారు. రాజకీయ అవినీతి విమర్శలపై ఎక్కువగా ఫోకస్ పెడతారు. అది నిజమా? కాదా? అన్నది ప్రజలు పెద్దగా పట్టించుకోరు. విమర్శలు వచ్చాయా? లేదా? అన్నదే ఆనాడు ఆలోచించారు. ఇప్పుడు నిజంగా మధనపడుతున్నారు. కాంగ్రెస్పార్టీ ఆర్టీఐ చట్టం తెచ్చిన పదేళ్లు ఎంతో పకడ్భందీగా అమలు చేశారు. అధికారుల చేసే ప్రతి పని మీద నిఘా పెట్టారు. ఎక్కడ అన్యాయం జరిగిందని ప్రజలకు అనుమానం విచ్చినా సమాదానం చెప్పుకోవాల్సి వస్తుందని ఒళ్లు దగ్గర పెట్టుకొని పనిచేశారు. కాని ఇప్పుడు ఏ అదికారికి ఆ భయంలేదు. సమచార హక్కు చట్టం పని వల్ల తమ కార్యకలాపాలు చేయలేకపోతున్నామని వంక పెట్టుకుంటున్నారు. సమయమంతా ఆర్టీఐ చట్ట సమాచారాలు అందించేందుకే గడిచిపోతుందని చెప్పుకుంటున్నారు. దాంతో సమాచారం ఇవ్వడానికి సమయం లేదనో..లేక సమాచారం ఇవ్వడం కుదరదని కూడా తెల్చి చెబుతున్నారు. సమచార హక్కు చట్టానికి తూట్లు పొడిచేస్తున్నారు. ఎప్పుడైతే సమాచార హక్కు చట్టాన్ని అదికారులు తేలికగా తీసుకోవడం అలవాటు చేసుకున్నారో అప్పటి నుంచి రాజకీయ, ఉద్యోగ వ్యవస్దలలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. దేశంలో ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు. అన్ని రాష్ట్రాలలోనూ అదికారుల అక్రమ సంపాదనకు అంతూ పొంతు లేకుండాపోతోంది. ఒకప్పుడు రాజకీయ అవినీతి గురించే మాట్లాడకునేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులను మించి పోతున్న అదికారుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక మంచి ప్రయత్నం చేసి దేశంలో కాంగ్రెస్పార్టీ దెబ్బతినిపోయింది. అవినీతి అదికారులు నీతులు వల్లించే పరిస్దితికి వచ్చే శారు. వారిలో కూడా దేశంకోసం దర్మం కోసం అని సద్దులు చెప్పే దాకా ఎదుగుతున్నారు. పట్టుబడినా తమపై కుట్రలు జరిగాయని సమర్ధించుకునే పరిస్ధితికి చేరుకున్నారు. నిజం చెప్పాలంటే ఆర్టీఐ చట్టానికి సంబందించిన చట్టాలు ఎంతో కఠినంగా వున్నాయి. కాని వాటిని అమలు చేస్తున్నారా? ఆర్టీఐ చట్టాలను అమలు చేసే ప్రత్యేక యంత్రాంగం లేకుపోవడం ఈ చట్టం ఫలాలను అందించలేకపోతోంది. ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోతోంది. అవినీతి పరులైన అదికారులు సమాచారం ఇవ్వడానికి ఎలాగూ ముందుకు రారు. ప్రభుత్వ భూమల ఆక్రమణలో అక్రమ వ్యాపారులకు సాయం చేసి, లబ్ధిపొందిన అదికారి ఆ భూముల వివరాలు ఇవ్వమంటే ఇస్తారా? చట్టాల అమలు తమ చేతుల్లోనే వుందన్న ధైర్యంతోనే అదికారులు ఎంతటి అవినీతికైనా తెగబడుతున్నారు. సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. ఒక వక్తి సమాచారం అడిగిన నిర్ధీత గడువులోగానే అదికారుల నుంచి సమాదానం రావాలి. పిర్యాధు దారుడు ఆశించిన సమాధానం ఇవ్వకుంటే ఆ అదికారి మీద చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వేటు వేయాలి. కాని ఎక్కడైనా జరిగిందా? అందరూ కలిసి ఆర్టీఐ చట్టానికి తూట్లు పొడవడమే కాదు, కొంత కాలం పోతే సమాధి కూడా చేస్తారు? ఇప్పటికైనా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు మేలుకోవాలి. ఆర్టీఐ చట్టం పకడ్భందీగా అమలుకు చర్యలు తీసుకోవాలి. ఆర్టీఐ కమీషనర్లు కూడా వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. మళ్లీ ఆర్టీఐ చట్టానికి పూర్వవైభవం తీసుకురావాలి. అవినీతికి, అన్యాయాలకు పాల్పడే వారు సమచార హక్కు చట్టం ద్వారా దొరికిపోతామనే భయం వారిలో కలగాలి. మార్పు వస్తుందో లేదో చూద్దాం!!
