
Anganwadi teachers
తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం..
తంగళ్ళపల్లి నేటి ధాత్రి..
తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడం జరుగుతుందని బిడ్డ పుట్టగానే గంటలోపు. ముర్రు పాలు పట్టాలని. ముర్రు పాలలో పుట్టిన బిడ్డకు కావలసిన పోషకాలు అందుతాయని.. అలాగే. ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలన మాత్రమే పట్టాలని చెప్పడం జరిగిందని. ప్రతి బిడ్డకు కనీసం రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు పట్టాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో. సూపర్వైజర్ సుస్మిత. పంచాయతీ సెక్రెటరీ లావణ్య. ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ మేఘమాల. అంగన్వాడి టీచర్లు. ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు