సూపర్వైజర్ యాదమ్మ
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
సమతుల ఆహారంతో మెదడు చురుకుగా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని అంగన్వాడి సూపర్వైజర్ యాదమ్మ అన్నారు. బుధవారంచండూరు మండల పరిధిలోని పుల్లెంల గ్రామంలో పోషకాహరం ఉత్సవాలు ఘనంగాజరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సూపర్వైజర్ జయప్రద మాట్లాడుతూ, పిల్లలు ఆరోగ్యవంతులుగా ఉండడానికి మన గ్రామంలో దొరికే ఆకు కూరగాయలలో పోషకాలు ఎక్కువగా ఉంటాయని, మనం ఎక్కువగా ఆకు కూరగాయాలను, పండ్లనువాడాలనిఆమె తెలిపారు.నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదగడానికి తీసుకోవలసిన సమతుల ఆహారం వ్యక్తిగత శుభ్రత పరిసరాల పరిశుభ్రత చదువు యొక్క ప్రాముఖ్యత బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాల గూర్చి వివరించారు. సమ తుల ఆహారం భుజించకపోతే పిల్లలలో మెదడు చురుకుగా పనిచేయకపోవడం వ్యాధి నిరోధక శక్తి తగ్గడం నాడీ వ్యవస్థ పని చేయకపోవడంజరుగుతుందన్నారు. అధిక బరువు పెరగడం ఊబకాయం కండరాలుఎముకలు దృఢంగా లేకపోవడం తొందరగా అలసిపోవడం దేనిపైన శ్రద్ధ లేకపోవడం తొందరగా కోపానికిగురిఅవ్వడం మానసిక ప్రశాంతతను కోల్పోయే ప్రమాదంఉందని, అన్ని రంగాలలో వెనకడుగు వేయడం ఎన్నో నష్టాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల బాలబాలికలు తప్పనిసరి ప్రతిరోజు తినే భోజనంలో చిరుధాన్యాలు ఆకుకూరలు పప్పు ధాన్యాలు పాలు పండ్లతో భోజనం చేసినట్లయితే పోషకాహార లోపాన్ని రక్తహీనతను తగ్గించవచ్చని ముందు ముందు అనుకున్న లక్ష్యం చేరుకుంటారని ఆమె అన్నారు. పిల్లలందరూ వ్యక్తిగత శుభ్రత ఆరోగ్య పరీక్షలు డివామింగ్ టాబ్లెట్లు విటమిన్ ఏ ద్రావము కనీసం ఆరు నెలలకు ఒకసారి అయినా తీసుకోవాలని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలోపంచాయతీ సెక్రెటరీ ప్రభు వర్ధన్ ,ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ధనమ్మ, అంగన్వాడీ టీచర్స్ పాల్వాయి ధనలక్ష్మి, గండు ధనలక్ష్మి, లక్ష్మి, పల్లె దవాఖాన డాక్టర్ గాయత్రి,ఏఎన్ఎం,మంజుల, ఆశా కార్యకర్త మరియమ్మ, అంగన్వాడి ఆయా పాలకూరి నాగమణి,తల్లులు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.