చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం బండపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థాన ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో నేటినుండి మార్చి 25 వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని ముగింపు రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ అర్చకులు శ్రీకాంత్ చారి తెలిపారు, మండల ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని తెలిపారు.