Corporator Inspects Box Drain Works in Meerpet
బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన:
కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్.
కాప్రా నేటిధాత్రి
మీర్ పేట హౌసింగ్ బోర్డు కాలనీ డివిజన్ నోమా కళ్యాణ మండపం నుండి రైల్వే ట్రాక్ వరకు ఇటీవల చేపట్టిన బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణ పనులను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ ఈ యొక్క బాక్స్ డ్రైన్ వెడల్పు నిర్మాణంతో వర్షం నీరు నిలవకుండా, స్థానికంగా నివాసం ఉన్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటారని, ఈ నిర్మాణం పూర్తయితే డ్రైనేజీ నీరు రోడ్లపైకి రాకుండా ప్రధాన సమస్య తీరుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీఈ రూప, ఏఈ లింగారావు, వర్క్ ఇనస్పెక్టర్ చారి, శ్రీనివాస్ స్థానిక నాయకులు సాయి కుమార్, శేఖర్ గౌడ్, దండెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
