మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో. స్థానిక బిజెపి పార్టీ కార్యాలయంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షులు వే న్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి. పలు విషయాలపై చర్చించడం జరిగింది ఇందులో భాగంగా. బీహార్ల్లో. ఎన్డీఏ.ప్రభుత్వం ఘనవిజయం సాధించడంతో. కార్యకర్తలకు కృషి ఎంతో ఉందని. ఇలాగే మనము కూడా ఉత్సాహంతో పని చేస్తూ రాబోయే ఎలక్షన్లో. అధికారం చేపట్టబోయే దిశగా కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని. దేశంలో మోడీ ప్రభావం చాలా ఉన్నందున ప్రతి రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం గెలుపొందుతూ వస్తుందని. ముఖ్యంగా కార్యకర్తలను అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్నారని సందర్భంగా తెలియజేస్తుంది అని కార్యకర్తలు అందరూ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఏకమై ఏకధాటిపై నిలవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమానికి ఇన్చార్జులుగా. జిల్లా ఉపాధ్యక్షులు శీలంరాజు. జిల్లా అధికార ప్రతినిధిగా నవీన్ యాదవ్ పాల్గొన్నారు. ఇట్టి కార్యకర్తల సమావేశంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ కుల ఆంజనేయులు మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. ఉపాధ్యక్షులు రెడ్డి మల్ల ఆశీర్వాద్. మహిళా మండల అధ్యక్షులు కోడం భవిత. జిల్లా కోశాధికారి రామలింగారెడ్డి. జిల్లా సో షల్ మీడియా కన్వీనర్ జూకంటి అఖిల్. బూత్ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
