ఘనంగా బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు.
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…
కరకగూడెం ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివాసీ అమరుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలను భట్టుపల్లి గ్రామంలోని కొమరం భీమ్ సెంటర్ నందు జరపడం జరిగింది. బిర్సా ముండా ఫోటోకి పూల మాల వేసి నివాళులు అర్పించిన అనంతరం పోలేబోయిన కృష్ణయ్య మాట్లాడుతూ బిర్సా ముండా చేసిన ఉద్యమాలను గుర్తుచేసాడు.చిన్న నాటి నుంచే చదువులో చురుకుగా ఉండేవాడు, తను ఎదుగుతున్న రోజుల్లో బ్రిటీష్ వాళ్ళు తీసుకువచ్చిన జమిందారి విధానానికి వ్యతిరేకంగా ఉల్గులన్ అనే పేరుతో మరియు అతని నినాదం అయినా “రాణి రాజ్యం అంతమై, మన రాజ్యం స్థాపించ బడాలి “అని తిరగబడ్డాడు.ఇతని చేసిన ఎన్నో పోరాటాలకు గుర్తుగా రాంచిలో ఒక రైల్వేస్టేషన్ కు బిర్సా ముండా పేరు నామకరణం చేసారు. ఇలాంటి గొప్ప నాయకున్ని దేశం గుర్తించి తన చిత్ర పాఠాన్ని దేశ పార్లమెంట్ లో ఉంచడం చాలా గర్వకారణం. ఈ కార్యక్రమంలో కరకగూడెం జేఏసీ అధ్యక్షులు పోలేబోయిన వెంకటనారాయణ, ప్రధానకార్యదర్శి కలం సాంబమూర్తి,కొమరం రామ్ గోపాల్, తుడుందెబ్బ అధ్యక్షులు పోలేబోయిన ప్రేమ్ కుమార్, ప్రధానకార్యదర్శి కలం సంపత్, సంక్షేమపరిషత్ అధ్యక్షులు చందా రామకృష్ణ, ఊకె నరేష్, పాయం నర్సింహారావు, కలం వేణుగోపాల్, ఇర్ప నాగకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
