ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన అధికారులు!!!
ఎoడపల్లి నేటిదాత్రి
ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో విద్యార్థులు యువత సమూహమై ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసేలా ఓటింగ్లో పాల్గొనేలా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల తహశీల్దార్ రవికాంత్ పాల్గొని, రాబోయే లోక్ సభ ఎన్నికలలో ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తూ యువత గ్రామస్తుల ప్రజా ప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో ఓటర్ అవగాహన సమూహ ర్యాలీ నిర్వహించారు అందరూ ప్రతి ఒక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని , ప్రతి ఒక్క ఓటరు ఓటింగ్లో పాల్గొనేలా ఓటింగ్ శాతం పెంచాలని ఓటర్లకి అవగాహన కల్పించాలని, బి ఎల్ వో లకు పలు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీనివాస్ మండల విద్యాశాఖ అధికారి బత్తుల భూమయ్య రెవెన్యూ పరిశీలకులు అన్వేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామచంద్రం గ్రామ పంచాయతీ కార్యదర్శి కుమార్ తాజా మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి ఎంపీటీసీ సభ్యులు గొల్లపల్లి శ్రీజ మల్లేశం బి ఎల్ ఓ లు భూసారపు భూలక్ష్మి పోడేటి సువర్ణ కొప్పుల పుష్పలత, మరియు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు బిసగోని సత్యం మరియు యువకులు గ్రామస్తులు విద్యార్థులు పాల్గొన్నారు