శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి వారికి ఘనంగా బోనాలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఝరాసంగం మండలం లోని కొల్లూర్ గ్రామస్తులు, గొల్ల కుర్మ కులస్తులు మహిళలు బుధవారం శ్రీ బీరప్ప స్వామి వారి జాతర ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి వారికి అభిషేకము, కుంకుమార్చన, అలంకరణ, సాయంత్రం గ్రామానికి చెందిన మహిళలు గ్రామస్తులు బోనాలతో ఊరేగింపుగా వచ్చి బోనాల నైవేద్యం సమర్పించారు. ఊరేగింపులో పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య భక్తిశ్రద్ధలతో బోనాల ఊరేగింపు శోభాయ మానంగా జరిగింది. ఉత్సవాలు తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శ్రీ బీరప్ప దేవాలయ కమిటీ కుర్మా సంఘం గ్రామ పెద్దలు పూర్తిస్థాయి ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.