
సురభిలో బోనాల సంబరాలు
కరీంనగర్, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని సురభి పాఠశాలలో బోనాల సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సంప్రదాయ వస్త్రధారణతో హాజరయ్యారు. అమ్మవారికి బోనాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొలాటం, తెలంగాణ జానపద నృత్యాలు, పాటలతో కార్యక్రమం చాలా రంజుగా సాగింది. విద్యార్థులందరూ ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈవేడుకలు మన సంస్కృతిని, సంప్రదాయాలను గుర్తు చేస్తూ అందరికి ఆనందాన్ని కలిగించాయి. ఈకార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ చిప్ప వీరేశం, డైరెక్టర్ చిప్ప వీర నర్సయ్య, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.