
బాలాజీ ఇంటిగ్రేటెడ్,అక్షర ద స్కూల్ లో ఘనంగా బోనాల పండగ.
నర్సంపేట,నేటిధాత్రి:
బాలాజీ విద్యాసంస్థల్లో విద్యాసంస్థల్లో ఒక్కటైన బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ మరియు అక్షర స్కూల్ లో శనివారం బోనాల పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ వనజ,ఎంఈఓ సారయ్య పాల్గొని బోనాల జాతర పండగ యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు.ఆషాడ మాసంలో తెలంగాణలో బోనాల జాతరలో ప్రజలు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి జరుపుకోవడం జరుగుతుంది అన్నారు. విద్యార్థులు బోనాలు ఇంటి వద్ద తయారు చేసుకుని వచ్చారు. మరికొందరు పోతురాజుల వేషధారణలో ఆకట్టుకున్నారు.ఈ కార్యక్రమంలో
బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి గౌడ్,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ భవాని,బాలాజీ మహిళా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ రామ్ రాజ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు,తల్లిదండ్రులు పాల్గొన్నారు.
బాలాజీ టెక్నో స్కూల్లో తెలంగాణ బోనాల సంబరాలు..
నర్సంపేట మండలంలోని లక్నేపల్లి లో గల బాలాజీ టెక్నో స్కూల్లో తెలంగాణ బోనాలు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించేలా విద్యార్థిని ,విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి మహంకాళి ,పోతరాజు వేషధారణలతో వచ్చి అందరినీ ఆకట్టుకునేలా బోనం ఎత్తుకొని ప్రదర్శనలు చేశారు.ఈ కార్యక్రమానికి బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆషాడ మాసంలో జరుపుకునే అతిపెద్ద హిందూ పండుగ. హైదరాబాద్ నగరంలో 1813 సంవత్సరంలో ప్లేగు వ్యాధి బారి నుండి బయటపడేందుకు ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారికి ప్రార్థనలు చేశారు. వ్యాధి వ్యాప్తి చెందకుండా నిలిచిపోవడంతో భక్తులు అమ్మవారికి బోనం సమర్పించారు.బోనం అంటే భోజనం అని అర్థం.ఇది మాతృదేవికి నైవేద్యం. ఇంట్లోమహిళలు పాలు, బెల్లం కలిపి మట్టి కుండలో గానీ ఇత్తడి పాత్రలో గాని భోజనం వండుతారు.వీటిని వేప ఆకులతో,పసుపుతో అలంకరిస్తారు అట్టి బోనాన్ని నెత్తిపై ఎత్తుకొని పోతరాజు విన్యాసాలతో వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారని ఈ సందర్భంగా వివరించారు.స్కూల్ ప్రిన్సిపల్ పి.రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మహిళలు సాంప్రదాయ చీరలో ఆభరణాలు ఇతర ఉపకరణాలు ధరించి అమ్మవారికి బోనంతో పాటు చీర ,గాజులు సమర్పిస్తారని,మాతృదేవతను ఎల్లమ్మ, పోచమ్మ, డెక్కలమ్మ, మారేమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకలమ్మ, పెడమ్మ వివిధ రూపాలలో అమ్మవారిని పూజిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.