టీఆర్ఎస్‌లోకి బొచ్చు రాజు స్వేరో చేరిక
పరకాల,నేటిధాత్రి
వరంగల్ జిల్లా నుంచి పార్లమెంట్‌కు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన బొచ్చు రాజు స్వేరో తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్)లో చేరారు.ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ను బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.అనంతరం తన అనుచరులతో కలిసి పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించిన బొచ్చు రాజు స్వేరో, ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో టీఆర్ఎస్‌ను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారంలో పార్టీతో కలిసి ముందుకు సాగుతానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు డా.పర్లపల్లి శ్రీశైలం,ఉమ్మడి పరకాల నియోజకవర్గానికి చెందిన బలుగూరి రమేష్,ఆత్మకూరు ప్రాంతానికి చెందిన అఖిల్ తదితర యువ నాయకులు పాల్గొన్నారు.
