– టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్
సిరిసిల్ల(నేటి ధాత్రి):
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలో అకాడమీల పేరుతో విచ్చలవిడిగా ఫీజుల దోపిడి కొనసాగుతుందని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పర్లపల్లి రవీందర్ అన్నారు. సోమవారం టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాదులోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఫీజుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పర్లపల్లి రవీందర్ విమర్శించారు. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పటికీ ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. అనంతరం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ జాయింట్ సెక్రెటరీ వినతిపత్రం అందించారు కార్యక్రమంలో టిఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు మూతి రాజిరెడ్డి పాల్గొన్నారు.