
కార్మికుల ఆరోగ్య సంక్షేమం కోసం బిఎంఎస్ కృషి
అధ్యక్షులు యాదగిరి సత్తయ్య
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికుల ఆరోగ్యం సంక్షేమం కోసం ఈఎస్ఐ డిస్పెన్సరీ,హాస్పిటల్ స్థాపనకు జైపూర్ పవర్ ప్లాంట్ యాజమాన్యం భూమి కేటాయించాలని పవర్ ప్లాంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చెన్న కేశవుల చిరంజీవి కి బుధవారం మెమోరండం అందించారు.అనంతరం యాదగిరి సత్తయ్య అధ్యక్షులు మాట్లాడుతూ యూనియన్ దీర్ఘకాలిక పోరాటం ఫలితముగా జైపూర్ పవర్ ప్లాంట్ కార్మికులకు ఈఎస్ఐ వైద్య హాస్పిటల్ కేటాయించిన బిఎంఎస్ ఈఎస్ఐ బోర్డు సభ్యులు బిఎంఎస్ కృషి ఫలితమని,తక్షణమే వైద్యం అందుబాటులోకి వచ్చే విధంగా యుద్ధ ప్రాతిపదికన భూమి కేటాయించి వైద్య సేవలు అందించుటకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామన్నారు.జైపూర్ పవర్ ప్లాంట్ సింగరేణి యాజమాన్యం స్థలం కేటాయించాలని,నిర్మాణానికి చర్యలు చేపట్టాలని బిఎంఎస్ చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించిన యాజమాన్యం తక్షణమే చర్యలు చేపట్టే విధంగా కృషి చేస్తామని తెలిపారు.వేలాది మందికి కార్మికులకు కాంట్రాక్ట్ కార్మికులకు చుట్టుపక్కల ప్రభావిత గ్రామాలకు సంబంధించిన సాగరవేణి ప్రజలకు అందుబాటులో మెరుగైన వైద్యం అందించుటకు బిఎంఎస్ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్,జనరల్ సెక్రెటరీ దుస్సా భాస్కర్,ముఖ్య నాయకులు వెంకటేశ్వర్లు,కిషన్ రెడ్డి,సతీష్ పాల్గొనడం పాల్గొన్నారు.