‘రక్తదానం – మహాదానం’
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి.
మహబూబ్ నగర్/నేటి ధాత్రి
రక్తదానం మహాదానమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని.. ఏనుగొండ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మహబూబ్ నగరంలోని ఏనుగొండ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణలో ఎస్విఎస్ హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మరియు ఉచిత మెడికల్ క్యాంపు శిబిరాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్త దాతలను ఆయన ప్రత్యేక అభినందించారు. ముందుగా అంబేద్కర్ చిత్ర పటానికి ఆయన పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూత్ కాంగ్రెస్ సభ్యులు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. అందుకు యూత్ కాంగ్రెస్ నాయకులను ఆయన అభినందించారు. అనంతరం నిర్వాహకులు ఎమ్మెల్యే నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టి.పిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, నాయకులు కిరణ్, వెంకటేష్ గౌడ్, సాయిబాబా, ప్రవీణ్ కుమార్, సంజీవ్ రెడ్డి, అబ్దుల్ హక్, సంజీవ్ రెడ్డి, పురుషోత్తం, చర్ల శ్రీనివాసులు, అశ్వాక్, మురళీధర్ గౌడ్, శాంతి కుమార్, మహ్మద్ కలీం, చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.