Timely Blood Donation Saves Life in Metpally
అత్యవసర సమయంలో రక్తదానం.
మెట్ పల్లి అక్టోబర్ 22 నేటి ధాత్రి
మెట్పల్లి పట్టణంలోని అమృత హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పల్లవి అను మహిళకు అత్యవసర చికిత్స నిమిత్తం బి పాజిటివ్ రక్తంఅవసరం అని పేషెంట్ కుటుంబ సభ్యులు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని సంప్రదించగా మెటపల్లి పట్టణంలోని 13వ వార్డు (రేగుంట)లో నివాసం ఉంటున్న బాల్క రాజేందర్ కి సమాచారం తెలుపగా రాజేందర్ వెంటనే స్పందించి బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది.
అత్యవసర సమయంలో ఫోన్ చేసిన వెంటనే స్పందించి రక్తదానం చేసిన బాల్క రాజేందర్ (11వ సారి రక్తదానం) అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది.
