బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి నియోజకవర్గం
శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో ఈరోజు సింగరేణి కాల రీస్ కంపెనీ ఏరియా హాస్పిటల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి సహకారంతో. హెచ్డిఎఫ్సి బ్యాంక్ సహకారంతో నిర్వహిస్తున్నాం.శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ స్థాపించిన కొద్దికాలంలోనే ఈ సమాజంలో రక్తం లేదని కారణంతో ఏ ఒక్కరు మరణించకూడదని సంకల్పంతో రక్తం లేక తల సేమియా వ్యాధిగ్రస్తులు నిరంతరం జీవన్మరణ సమస్యలతో జీవిస్తున్నారు.అలాంటివారు మన జిల్లాలో అత్యధికంగా జీవిస్తు నారు వారిని కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా నేటి యువత పెడదారిన పట్టకుండా ఆరోగ్యవంతమైన సమాజం కోసం,రక్తదానం. నేత్రదానం. అవయవ దానం పైన అవగాహన పెంచుకుని. సమాజంలో స్ఫూర్తిదాయకంగా జీవించాలన్నారు. శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ భవిష్యత్తులో అనేక సామాజిక సేవా కార్యక్రమాలలో భాగస్వామ్యం అవుతామని సమాజాభివృద్ధిలో మేము సైతం ముందుంటామని పేర్కొన్నారు. ఈరోజు ఈ రక్తదాన శిబిరంలో 70 యూనిట్లకు పైగా రక్తదానం చేశారు. రక్త దాతలు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. వారికి సర్టిఫికెట్స్ అందజేశారు. రక్తదాన శిబిరానికి సింగరేణి హాస్పిటల్ ను మాకు అవకాశం కల్పించినందుకు బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్, సూపర్డెంట్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో శ్రీరామ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు తుమ్మల సురేష్, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి రాహుల్ కోశాధికారి బింగి రాజశేఖర్. అట్ట సత్యనారాయణ రెడ్డి, మహమ్మద్ అక్బర్ బింగి సతీష్ , చెలిమల్ల మల్లేష్ గుజ్జ కిరణ్, తుమ్మల సాగర్ రెడ్డి, రెడ్ క్రాస్ బాధ్యులు గజల్లి మోహన్, ఈ కార్యక్రమంలో.నునేటి సత్యనారాయణ.గజల్లి చంద్రశేఖర్. రెడ్ క్రాస్ సిబ్బంది హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.