నేటిధాత్రి, వరంగల్ తూర్పు
వరంగల్ తూర్పు పరిధిలోని 22వ డివిజన్, గోపాలస్వామి గుడి, కొత్తవాడ తోటమైదానం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలకు సహాయార్థంగా రక్తదాన శిబిరంను, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సమక్షంలో ఏర్పాటు చేశారు. ఇట్టి కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తల సేమియా బాధితులకు స్వచ్చందంగా రక్త దానం చేసేందుకు వాకర్స్ ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో 23వ డివిజన్ కాంగ్రెస్ నాయకులు చిప్ప వెంకటేశ్వర్లు, ఎలుగం సత్యనారాయణ, గోపాల్, స్వామి, వాకర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జయప్రకాష్, సెక్రటరీ ఎం. వెంకటేశ్వర్లు, ట్రెజరర్ పోరండ్ల సాంబయ్య, సభ్యులు చల్ల కుమారస్వామి, ఏల్పుల అంజయ్య, పులి ప్రభాకర్, నూనె రాజేశం, జి రాము, తోట సురేష్, చిప్ప అయిలయ్య, తోట రాము, సిరాబోయిన రాజు, మూగ భాస్కర్, గంజి రాజు, చిగురుమామిడి ప్రభాకర్, నవీన్, ఏ.సుధాకర్, ఎస్ రాజు, కట్ట సంజీవ్, ఎస్.కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మహిళా డోనర్లు నవ్యశ్రీ, మంజుల, రజిత అనే మహిళ డోనర్స్ కూడా ముందుకు వచ్చి వారి యొక్క రక్తాన్ని తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయడం పలువురు ఆ మహిళలను అభినందించారు. అనంతరం రక్తదానం చేసిన వాకర్స్ కు సర్టిఫికేట్లు అందచేశారు. ఈ రక్తదాన శిబిరం ద్వారా 67యూనిట్లు బ్లడ్ సేకరించినట్లు రెడ్ క్రాస్ సిబ్బంది తెలిపారు