సమస్యలకు నిలయంగా జహీరాబాద్ బస్ డిపో
కనీస సౌకర్యాలు లేక ప్రయాణికుల అవస్థ…..
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్,రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టే జహీరాబా ద్ బస్ డిపో నేడు సమస్యలకు నిలయంగా మారింది. ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో ప్రయాణి కులతో పాటు ఆర్టీసీ సిబ్బంది కూడా ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వస్తుంది. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఉన్న ఈ డిపో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రయాణికులే కాకుండా మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు సైతం ఇక్కడి బస్సుల్లో నిత్యం ప్రయాణిస్తుంటారు. ఎంతో ప్రాముఖ్యత గల ఈ డిపోలో కనీసం పారిశుధ్య పనులు కూడా సక్రమంగా చేపట్టకపోడంపట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పరిసర ప్రాంతాలు పిచ్చి మొ క్కలు, గడ్డి చెత్త చెదారంతో నిండి పారిశుధ్యం లోపించి దుర్గంధం వెదజల్లుతుంది. ముఖ్యంగా డిపో మేనేజర్ కార్యాలయం చుట్టూ కూడా పరిస్థితి తీసికట్టుగా ఉంది. ఈ కార్యాలయానికి ఆనుకొని ఉన్న కాంపౌండ్ వాల్ శిథిలావస్థకు చేరి ప్రస్తుతం కూలిపోయి దర్శనమిస్తుంది.
అయినా దీనిని మరమ్మతులు చేయకపోవడంతో పశువు లు, ఇతరులు లోపలికి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. కాగా మేనేజర్ కార్యాలయ భవనం కూడా రంగులు వెలిసిపపో యి అక్కడక్కడ గోడల పెచ్చులు ఊడిపోయి తీసికట్టుగా మారింది. ఇక బస్టాండ్ పరిస ర ప్రాంతంలోని అంతర్గత రోడ్లు ధ్వంసం కావడంతో బస్సుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చిరుజల్లుకే ఆ గుంతలు నీటితో నిండిపోతున్నాయి. ఇక ప్రయాణికుల సామూహిక మరు గుదొడ్లు, మూత్రశాలలను వెనువెంటనే శుభ్రం చేయక పోవడంతో దుర్గంధం వెదజల్లుతుంది.అయినా ప్రయా ణికులు గత్యంతరం లేక ముక్కు మూసుకొని మరుగుదొడ్లు మూత్రశాలలను ఉపయోగిం చుకుంటున్నారు. కాగా బస్టాండ్ లోగల రెండు పార్కింగ్ ప్రదేశాల్లో కూడా చెత్తా చెదారం నిండి ప్రయాణికులు ఇక్క ట్లు పడుతున్నారు. ఇంకా అనేక సమస్యలతో జహీరాబాద్ బస్సు డిపో కొట్టుమిట్టాడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రయా ణికులు కోరుతున్నారు.