Sothku Posham Seeks Support in 7th Ward Election
ప్రజా సేవకుడిగా దీవించండి
7వ వార్డ్ మెంబర్ అభ్యర్థి సొత్కు పోషం
జైపూర్,నేటి ధాత్రి:
జైపూర్ మండలం ముదిగుంట గ్రామంలోని కొత్తగూడెం 7వ వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తున్న సొత్కు పోషం గ్యాస్ పొయ్యి గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా సొత్కు పోషం మాట్లాడుతూ.. తమ గ్రామంలో ఏ కార్యక్రమం చేపట్టిన తనే ముందు ఉండి అందరితో కలిసి ప్రేమ,అభిమానాలను పంచుతూ ఉండేవారన్నారు.గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తనే ముందుండి నడిపించే వారన్నారు.తను చేసిన సేవలను గుర్తించి గ్రామ ప్రజలు తనకి ఒక అవకాశం కల్పించాలని కోరారు.తనని వార్డ్ మెంబర్ గా గెలిపిస్తే వార్డు ప్రజలకి సేవ చేస్తూ గ్రామ అభివృద్ధి తోడ్పడతానని తెలిపారు.
