ఆశీర్వదించండి అండగా ఉంటా..

కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి

షాద్ నగర్ పట్టణ, ఫరూఖ్ నగర్ కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.

వంశీచంద్ రెడ్డి గెలుపుకై కార్యకర్తలు సన్నిద్ధం కావాలి.

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే అండగా నిలబడతానని మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. వంశి చంద్ రెడ్డి గెలుపే లక్ష్యంగా సోమవారం పట్టణ కేంద్రంలో ఫరూఖ్ నగర్ మండలం, షాద్ నగర్ పట్టణ కార్యకర్తల సమావేశాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి,మాజీ జడ్పీటీసీ శ్యామ్ సుంధర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల అభిప్రాయం మేరకే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను ఎంపీ అభ్యర్థిగా ఎన్నిక చేసిందని గెలిపించే బాధ్యత మీదే అన్నారు. నేను ఏ పదవిలో ఉన్న మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను అన్నారు. రాష్ట్రంలో మన ప్రజా ప్రభుత్వం ఉన్నదని, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తొమ్మిదన్నరేండ్ల పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయని బిఆర్ఎస్ కు కాంగ్రెస్ ను ప్రశ్నించే నైతిక హక్కు లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలను అమలు చేసి నిబద్ధత చాటుకున్నదని ఎమ్మెల్యే అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నట్లుగానే, కేంద్రంలో అధికారంలో తెచ్చుకుంటేనే బిజెపి చేతిలో నిర్వీర్యమైన ఈ దేశాన్ని కాపాడుకునేందుకు, ప్రజలకు మంచి చేసేందుకు అవకాశం ఉంటుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ షాద్ నగర్ నుండి ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ కి రెండింతలు మెజార్టీ ఇవ్వడం కొరకు కార్యకర్తలు సన్నద్ధమన్నారు. దాంట్లో ఎలాంటి అతిశయం లేదని అన్నారు. కార్యకర్తలు అందరూ గ్రామాల్లో ఒక సైనికుల్లా పనిచేసి ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తే ప్రతి పని, ప్రతి పథకం కూడా అమలవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి వెంకటరామిరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ విశ్వం, చెంది తిరుపతి రెడ్డి, రఘు, పిసిసి సభ్యులు మొహమ్మద్ అలీఖాన్ బాబర్, మాజీ జెడ్పిటిసి కందివనం సూర్య ప్రకాష్, ఎంపిటిసిలు మాజీ సర్పంచులు వివిధ విభాగాల బాధ్యులు, మండల, పట్టణ నాయకులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!