నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం రోజున విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పరీక్షించేందుకు స్టేట్ ఎడ్యుకేషన్ అచీవ్మెంట్ సర్వే (ఎస్ ఈ ఏ ఎస్) పరీక్ష చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో మూడవ తరగతి విద్యార్థుల కోసం ఈ పరీక్ష సెంటర్ ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరుగుతున్న సెంటర్ ను బ్లాక్ లెవెల్ కోఆర్డినేటర్(బి ఎల్ సి) హనుమంతు రావు సందర్శించి సెంటర్ నిర్వహణ తీరును, పరీక్ష విధానంను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బి ఎల్ సి వెంబడి పాఠశాల ప్రధానోపాధ్యాయులు వచ్చే అచ్చ సుదర్శన్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ మైతిలి, సిఆర్పి రఘుపతి , ఉపాధ్యాయులు పోలంపల్లి విజేందర్, నిగ్గుల శ్రీదేవి ఉన్నారు.